ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి
సూర్య జగిత్యాల ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో జగిత్యాల నియోజకవర్గానికి 2,000 ఇళ్లు మంజూరైన నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అధికారులకు సూచించారు. జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రెండో విడతలో మంజూరైన ఇళ్లకు అర్హులైన లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనల ప్రకారం ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు.