హైదరాబాద్ అండర్-19 మహిళల జట్టుకు అశ్విత ఎంపిక
‘’లార్డ్స్ హైస్కూల్‌లో ఘనంగా సన్మానం''
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( హెచ్ సి ఏ ) నిర్వహించిన ఎంపికల్లో హైదరాబాద్ అండర్–19 మహిళల క్రికెట్ జట్టుకు జిల్లెలగూడ లార్డ్స్ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థిని అక్కి ఆశ్రిత గౌడ్ ఎంపికయింది. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ఆమెను ఘనంగా సన్మానించింది. ఆశ్రిత ఎంపిక పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యా
యులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ సిద్ధాల బీరప్ప మాట్లాడుతూ.. క్రీడల్లో ప్రతిభ చాటుతూ పాఠశాలకు, హైదరాబాద్ నగరానికి మంచి పేరు తీసుకురావడం గర్వకారణమన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో ఆశ్రిత మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
వైస్ చైర్మన్ బెర్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహిం
చడం పాఠశాల బాధ్యత అన్నారు. డైరెక్టర్ సిద్ధాల శ్రీలత మాట్లాడుతూ.. ఆశ్రిత విజయం తోటి విద్యార్థులకు స్ఫూర్తి
దాయకమని, క్రీడలు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. డీన్ బబ్బూరి సతీష్ మాట్లాడుతూ.. ఆశ్రిత విజయానికి తల్లిదండ్రులు, కోచ్‌లు, పాఠశాల అందించిన ప్రోత్సాహం ఎంతో దోహదపడిందన్నారు. అనంతరం ఆశ్రితను పాఠశాల యాజమాన్యం భారీ జ్ఞాపికతో ఘనంగా సత్కరించింది.
ఆశ్రిత తండ్రి ఈశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. తన కుమార్తెను ప్రోత్స
హిస్తున్న పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబర్ 7 నుంచి కేరళలోని తిరువనంతపురంలో జరిగే పోటీల్లో హైదరాబాద్అండర్–19 మహిళల జట్టు తరఫున ఆశ్రిత ప్రాతినిధ్యం వహించ
నుందని వెల్లడించారు. తనకు లభించిన గౌరవంపై ఆశ్రిత గౌడ్ మాట్లాడుతూ.. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సహ విద్యార్థులు అందించిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపింది. మరింత కష్టపడి సాధన చేసి భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడమే తన లక్ష్యమని పేర్కొంది.ఈ
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎం.ఎల్. మారియన్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ఆశ్రితకు అభినం
దనలు తెలిపారు. యువ క్రీడాకారిణిగా ఆశ్రిత సాధించిన ఈ విజయంతో జిల్లెల
గూడకు, లార్డ్స్ హైస్కూల్‌కు ప్రత్యేక గుర్తింపు లభించిందని పలువురు పేర్కొన్నారు.
- బి గణేష్ : మేజర్ న్యూస్, బాలపూర్.