BREAKING
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ - విద్యార్థి విద్యాసంస్థల అధ్యర్యంలో బతుకమ్మ సంబురాలు స్టార్ డైరెక్టర్ వివి వినాయక్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ బర్త్ డే విషెస్! చిక్రం శ్రీనివాస్ కుటుంబానికి గ్రామస్థుల ఆర్థిక సహాయం జనగామ జిల్లా ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ గా గోసంగి కిషన్ నియామకం ఉన్నత పాఠశాలకు క్రీడా పరికారలు ఏర్పుమల్లలో ఘనంగా బతుకమ్మ సంబరాలు రహదారిని కమ్మేసిన ముళ్ళ పొదలు వేలాడుతున్న చెట్టు కొమ్మ తొలగింపు.. స్పందించిన ఉట్నూర్ సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై రేపు కేబినెట్ లో చర్చ సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు 986(1)ఏ సర్వే నంబర్ భూముల సమస్యకు పరిష్కారం.. 100 కుటుంబాలకు ఊరట! రైతుల కష్టాలు చూసి చలించిన మాతృహృదయం.. సొంత ఖర్చులతో డొంక దారి బాగు చేసిన పోకల శ్రీనివాసరావు అశ్వారావుపేటలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం* మసీదు సమీపంలో మద్యం దుకాణం వద్దు.. స్థానికుల నిరసన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఘన స్వాగతం

ఉచిత కంటి వైద్య శిబిరం కరపత్రాలు ఆవిష్కరణ

Select Suryaa Now
ఉచిత కంటి వైద్య శిబిరం కరపత్రాలు ఆవిష్కరణ

 రేణిగుంట: మెగా ఉచిత కంటి వైద్య శిబిరం కు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం లైన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్ అధ్యక్షుడు జూలియన్ రాజు మాట్లాడుతూ.. లైన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్, తిరుపతి అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఆదివారం ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు ఉచిత కంటి వైద్య శిబిరం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇందులో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్‌కు చెందిన అనుభవజ్ఞులైన కంటి వైద్య నిపుణుల బృందం పాల్గొని ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, కంటి ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ చేసి మందులు పంపిణీ చేస్తారని తెలిపారు.కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారు  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ సెక్రటరీ రాజేంద్ర, ట్రెజరర్ కోటేశ్వరరావు, మురళి, గురు మోహన్ తదితరులు పాల్గొన్నారు.