BREAKING
పోక్సో చట్టంపై న్యాయ అవగాహన పోస్టర్ ఆవిష్కరణ శ్రీ సంజీవ స్వామి ఆలయ నిర్వహణ హక్కులపై వివాదం.. పార్థసారథి పిటిషన్‌పై మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి అభ్యంతరం మాచర్ల : అభివృద్ధి చూసి ఓటు వేయండి. ప్రచారంలో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థులు అభివృద్దే మా అభిమతం, ఎజెండా.. సీనియర్ మైనారిటీ నాయకులు బీడీ మస్తాన్ సహా పలువురు టీడీపీలో చేరిక సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం. ఎమ్మెల్యే అమిలినేని. పారిశుద్ధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సమష్టిగా కృషి చేయాలి గొట్టల గడ్డ తాండలో హనుమాన్ దేవాలయ ప్రారంభోత్సవానికి పట్నం మహేందర్ రెడ్డి కి ఆహ్వానం అంబులెన్స్‌లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చిన గర్భిణి.. చాకచక్యంగా ప్రసవం చేసిన 108 సిబ్బంది పట్టణ సమగ్ర అభివృద్ధికి కూటమి అభ్యర్థులకు మద్దతివ్వాలి - ఎమ్మెల్యే ముత్తుముల తుఫాన్‌కు కూలిన చెట్టు తొలగింపు కలెక్టర్ దీపక్ తివారి అధ్యక్షతన జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం *​ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఒంగోలులోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ.వి.హర్షవర్ధన్ రాజు

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ పర్యటన

Select Suryaa Now
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ పర్యటన

భీమవరం: అర్నబ్‌ తుపానుతో దెబ్బతిన్న విద్యుత్‌ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి, 24 గంటల్లో సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి, పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గురువారం ఆయన పర్యటించి, దెబ్బతిన్న విద్యుత్‌ స్తంభాలు, రహదారులు, పంట పొలాలను పరిశీలించారు. పాలకొల్లు, భీమవరం, నరసాపురం ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. బాధిత ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం భీమవరం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో విద్యుత్‌ పునరుద్ధరణ, పంట నష్టం అంచనాలు, తాగునీటి సరఫరా, రహదారుల మరమ్మతులు, పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్షించారు.

రూ.500 కోట్ల మేర నష్టం
తుపాను కారణంగా రాష్ట్ర విద్యుత్‌ వ్యవస్థకు ప్రాథమికంగా సుమారు రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు మంత్రి తెలిపారు. పూర్తిస్థాయి అంచనాల అనంతరం నష్టం వివరాలు వెల్లడవుతాయన్నారు. ప్రస్తుతం 1,700 మంది సిబ్బంది పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్నారని, రాష్ట్రంలోని మూడు డిస్కమ్‌ల నుంచి అదనంగా మరో 500 మందిని రప్పిస్తున్నట్లు వివరించారు. తెలంగాణ నుంచి కూడా 500 మంది విద్యుత్‌ సిబ్బంది పునరుద్ధరణ పనుల్లో భాగస్వాములయ్యారని చెప్పారు.

విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు అవసరమైన సిబ్బంది, నిధులు, సామగ్రి విషయంలో కొరత రానివ్వకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. దెబ్బతిన్న స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం, తెగిపోయిన తీగలను సరిచేయడం, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

పశ్చిమగోదావరిలో భారీ నష్టం
అర్నబ్‌ తుపాను ప్రభావం పశ్చిమగోదావరి జిల్లాలో విద్యుత్‌ వ్యవస్థపై తీవ్రంగా పడిందని మంత్రి తెలిపారు. జిల్లాలో సుమారు 3,700 విద్యుత్‌ స్తంభాలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారని, దాదాపు 400 గ్రామాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. తుపాను తీరం దాటిన నరసాపురం, పరిసర గ్రామాల్లో నష్టం అధికంగా ఉందన్నారు. ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని, ఒక ప్రాంతంలో పనులు పూర్తయిన వెంటనే అక్కడి సిబ్బందిని మరో ప్రాంతానికి తరలించి పునరుద్ధరణ వేగం పెంచాలని సూచించారు. అవసరమైన చోట అదనపు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర సామగ్రిని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
విద్యుత్‌ అంతరాయంతో గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి అధికారులకు సూచించారు. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పూర్తయ్యే వరకు అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో తాగునీరు అందించాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి, వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.

పంట నష్టంపై తక్షణమే అంచనాలు
తుపానుతో దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటల నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అధికారులను ఆదేశించారు. గురువారం నుంచే పంట నష్టం వివరాలను సేకరించి, ప్రభుత్వానికి నివేదిక అందించాలని సూచించారు. రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, తుపాను బాధిత రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, రోడ్లపై పడిపోయిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని ఆదేశించారు. విద్యుత్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, రోడ్లు భవనాలు, వ్యవసాయ, గ్రామీణ నీటి సరఫరా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సాధారణ పరిస్థితులు వచ్చే వరకు క్షేత్రస్థాయిలోనే..
తుపాను ప్రభావం తగ్గిందనే కారణంతో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. ప్రభావిత గ్రామాలకు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించడం, తాగునీరు అందించడం, రహదారులను పూర్తిస్థాయిలో మరమ్మతు చేయడం వరకు అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఆదేశించారు.
రాష్ట్ర విద్యుత్‌ సంస్థల సిబ్బందితో పాటు తెలంగాణ నుంచి వచ్చిన అదనపు బృందాల సేవలను వినియోగించుకుంటూ పునరుద్ధరణ పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. బాధితులకు అవసరమైన సహాయం అందించడంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశించారు. సమీక్షలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.