తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువతలో ఉత్సాహం
విజయవాడ, మేజర్ న్యూస్: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో యువ ఓటర్లు ప్రత్యేక ఉత్సాహం చూపించారు. తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువత పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములవుతూ బాధ్యతాయుత పౌరులుగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యువ ఓటర్ల భాగస్వామ్యం పోలింగ్ కేంద్రాల్లో సందడి నెలకొల్పింది. నా ఓటు – నా హక్కు, నా బాధ్యత అనే స్ఫూర్తితో యువత ప్రజాస్వామ్య విలువలను చాటారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.