టిడిపి పరిపాలనలో మత్యకారుల సంక్షేమం
ముత్తుకూరు, మేజర్ న్యూస్ : టిడిపి పరిపాలనలోనే మత్స్యకారుల సంక్షేమం జరిగిందని అధికార పార్టీ నాయకులు అన్నారు. గురువారం రాత్రి కృష్ణపట్నం ఎంపీటీసీ స్థానం బిట్ -2 నందు టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోచర్ల మురళీకృష్ణ కు అండగా నిలుస్తూ మండల పార్టీ నాయకులు ఈదురు రామ్మోహన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేశారు. స్థానిక అధికార పార్టీ నాయకులు రాగాల శివకృష్ణ, మామిడాల శ్రీనివాసులు, కారంచేటి శివరామ ప్రసాద్ శర్మ, పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రచారం చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి మోచర్లను గెలిపించాలని మత్స్యకారులకు మండల పార్టీ నాయకులు ఈదురు సూచించారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అడిగినారు ఈ కార్యక్రమంలోకార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.