BREAKING
ప్రతి పౌరుడు గర్వపడేలా అభివృద్ధి చేస్తాం -56వ డివిజన్ ప్రచారంలో బ్యాంకు శాంతమ్మ అన్నా మా ఓటు మీకే...గెలిచేది మీరే అన్న -ఆదం సుధాకర్ రెడ్డికి ప్రచారంలో ఓటర్లు భరోసా డివిజన్ రూపు రేఖలు మారుస్తా... -60వ డివిజన్ ప్రచారంలో ఆకేపాటీ సుభాషిణి మీ వాడిగా నిత్యం అందుబాటులో ఉంటా... -59వ డివిజన్ ప్రచారంలో జగదీష్ ప్రజలకు హా టిడిపిని గెలిపించి అభివృద్ధికి సహకరించండి -57వ డివిజన్ ప్రచారంలో గాలి కావ్య విజ్ఞప్తి ఆరు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తా -63వ డివిజన్ ప్రచారంలో పుష్పావతి హామీ మా తమ్ముడికి అవకాశం ఇవ్వండి -మాధవ నగర్ లో అన్నా అనిత ప్రచారం కూటమితోనే నగరాభివృద్ధి సాధ్యం... -అరుణోదయ నగర్ ప్రచారంలో అన్నా మల్లీశ్వరి ఫీజుల పేరుతో బీఈడీ ప్రవేశాలు నిరాకరించడమా...! నేటి రాశి ఫలాలు –27 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 27 అక్టోబర్ 2026 ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి.. అగ్రిస్టాక్‌పై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్.. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి కృష్ణా జిల్లా సాధారణ పరిశీలకునిగా వి. అభిషేక్ నియామకం

టిడిపి ఎంపిపి ఆభ్యర్ధిగా డాక్టర్ బొమ్మనబోయిన వెంగయ్య

Select Suryaa Now
టిడిపి ఎంపిపి ఆభ్యర్ధిగా డాక్టర్ బొమ్మనబోయిన వెంగయ్య

ఎమ్మెల్యే ఉగ్రకు కృతజ్ఞతలు తెలిపిన వెంగయ్య

నాడుచేజారిన పదవి నేడు దక్కిన ఫలితం

వెంగయ్యకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు

సిఎస్ పురం,మేజర్ న్యూస్: సిఎస్ పురం మండల పరిషత్ అధ్యక్షుడుగా మండలంలోని చెర్లోపల్లె గ్రామానికి చెందిన మండల టిడిపి సీనియర్ నాయకులు, ప్రభుత్వ కనీసవేతనాల సలహామండలి సభ్యులు డాక్టర్ బొమ్మనబోయిన వెంకటేశ్వర్లు(వెంగయ్య)ను కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆదివారం ప్రకటించారు.కనిగిరి అమరావతి గ్రౌండ్స్ నందు మండల టిడిపి జనసేన బిజెపి నాయకులు కలిసి నామినేషన్ల ప్రక్రియను ఎమ్మెల్యేకు వివరించిన అనంతరం జరిగిన కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడుగా రెడ్డిగారికొత్తపల్లె ఎంపిటిసిగా పోటీచేసిన డాక్టర్ బొమ్మనబోయిన వెంగయ్యను టిడిపి కూటమి శ్రేణుల హర్షధ్వానాల మధ్య నాయకులందరి ఏకాభిప్రాయంతో ఎమ్మెల్యే ప్రకటించారు. బొమ్మనబోయిన వెంగయ్య టిడిపిలో 1987నుండి కొనసాగుతూ పసుపుజెండాను పట్టుకుని అధిష్టానం ఆదేశించిన ప్రతికార్యక్రమంలో పాల్గొని మండలంలో టిడిపి అభివృద్ధికి విశేషకృషి చేసిన అత్యంత సీనియర్ నేతగా వెంగయ్యకు 1995 సంవత్సరం జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో ఎంపిపి పదవి కేటాయించగా ఎన్నికల్లో టిడిపి మెజార్టీ స్థానాలు సాధించిన వెంగయ్య పోటీచేసిన ఎంపిటిసి స్థానంలో ఓడిపోవడంతో ఎంపిపి పదవి మరొకరికి కేటాయించారు.అప్పటి నుండి టీడీపీని మండలంలో బలోపేతం చేసే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ముక్కుకాశిరెడ్డి,కదిరిబాబురావు,ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గెలుపుకు ప్రముఖపాత్ర పోషించిన వెంగయ్య సుమారు 7సంవత్సరాల కిందట మండల టిడిపి అధ్యక్షుడుగా ఉంటూ మండలంలో టిడిపిశ్రేణులను సమన్వయం చేసుకుని టిడిపిని తిరుగులేనిశక్తీగా అభివృద్ధిచేసి గతవైసీపీ ప్రభుత్వంపై పోరాటాలు చేసి గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డికి మండలంలో మెజారిటీ సాధించడంలో వెంగయ్య విశేషకృషి చేశారు. నాడు ఎంపిపి పదవి చేజారిన పట్టువదలని విక్రమార్కునిలా పార్టీకోసం కష్టపడుతూ మండల పరిషత్ ఎన్నికల సందర్భంగా మండలంలో ఆర్.కె.పల్లి ఎంపీటీసీగా పోటీచేయగా నామినేషన్ల పరిశీలన అనంతరం మండలంలోని 13ఎంపిటిసిలలో 11స్థానాలు టిడిపి కూటమికి దక్కుతుండగా కీలకమైన మండల పరిషత్ అధ్యక్షుడు ఎంపిక నామమాత్రం కావడంతో ఎంపిపి అభ్యర్థిగా డాక్టర్ బొమ్మనబోయిన వెంగయ్యను ఎమ్మెల్యే ప్రకటించారు. ఈసందర్భంగా వెంగయ్య మాట్లాడుతూ తనకు యంపీపీ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అదేవిధంగా సహకరించిన టిడిపి జనసేన బిజెపి కూటమి నాయకులకు అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు అన్నారు.ఈసందర్భంగా ఎంపిపి అభ్యర్థిగా ఖరారు అయిన వెంగయ్యకు పలువురు అభినందన శుభాకాంక్షలు తెలిపారు.