తపాలా సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : తపాలా శాఖ అందించే సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆత్మకూరు సహాయక తపాల సూపర్నెంట్ పి. మదన్ మోహన్ కోరారు.అక్టోబర్ 10న ప్రపంచ తపాలా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు జాతీయ తపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తపాలా సేవింగ్స్ ఖాతాలమేళాలు, గ్రామీణ తపాలా జీవిత బీమా పథకాల మేళాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం స్థానిక పోస్టల్ సిబ్బందితో ఏఎస్పీ మదనమోహన్ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఉద్యోగులు,ఖాతాదారులు, ప్రజలు తపాల శాఖ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రజలకు తపాలా సేవలు మెరుగ్గా అందించాలని ఆయన సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పోస్ట్ మాస్టర్ వై.భాస్కరరావు, జి. వెంకటేశ్వర్లు,తపాలా సిబ్బంది పాల్గొన్నారు.