తైక్వాండో పోటీలలో మదనపల్లి విద్యార్థుల అద్భుత ప్రతిభ
- 9 బంగారు పతకాలతోపాటు 18 పతకాలు కైవసం
-అనంతపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
మదనపల్లె : తిరుపతి నగరంలో సెప్టెంబర్ 30వ తేదీ జరిగిన జిల్లా తైక్వాండో పోటీలలో అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణం,నీరుగట్టువారిపల్లె,సాయిరాం స్ట్రీట్ సెకండ్ క్రాస్ పరిధిలో గల జెపి తైక్వాండో అకాడమీ విద్యార్థులు సత్తాచాటారు.ఈ సందర్భంగా శుక్రవారం కోచ్ పి.విఘ్నేష్ మాట్లాడుతూ మా జెపి తైక్వాండో అకాడమీలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు జిల్లాస్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం హర్షణీయమన్నారు.ఇందులో ఆర్.హర్ష,ఎస్.మధుసాయి,ఎం.హిత్విక్,కే.కావ్య,కే.వన్షిక రెడ్డి,పి.మల్లీశ్వరి,సి.విశ్వ,ఎన్.సాత్విక్,వి.ఉదయ్ కిరణ్ అనే విద్యార్థులు బంగారు పతకాలు కైవసం చేసుకోగా,ఎస్.గీతిక,సి.మాన్య,సి.వరుణ్ కార్తీక్,కే.లాస్య,కే.కార్తీక రెడ్డి,సి.విశ్వసాయి తేజ,వి.మహిధర్,ఇమ్రాన్,హర్ష అనే విద్యార్థులు సిల్వర్,బ్రాంజ్ పతకాలు సాధించారన్నారు.మొత్తం 18 పతకాలు కైవసం చేసుకోవడం తమ అకాడమీకే కాకుండా జిల్లాకే గర్వకారణమన్నారు.ఈ విద్యార్థులు అక్టోబర్ 12,13 తేదీలలో అనంతపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని,ఇదే స్ఫూర్తితో రాణించి రాష్ట్రస్థాయి పోటీలలో అద్భుత విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.గత 16 సంవత్సరాలుగా జెపి తైక్వాండో అకాడమీ ద్వారా విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణ అందిస్తున్నామన్నారు.ఆత్మరక్షణ విద్యలో ఒక్కటైన తైక్వాండోపై ఆసక్తి కలిగిన విద్యార్థులు 9959873159 అనే మొబైల్ నెంబరుని సంప్రదించాలని కోరారు.తమకు అన్నివిధాలా సహాయ,సహకారాలు అందిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో తైక్వాండో శిక్షకులు శివకుమార్,గంగరాజు,విద్యార్థుల తల్లిదండ్రులు ఇర్రి నాగప్రసాద్ నాయుడు,శివశంకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.