సుంకులమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలు ప్రారంభం
వెల్దుర్తి, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్:స్థానిక వడ్డగేరిలో వెలసిన శ్రీ సుంకులమ్మ అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ పురోహితుడు యార్లపాటి శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, కుంకుమార్చనలు, మహా మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఉత్సవాల మొదటి రోజైన ఆదివారం అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖులు గౌండ నాగేంద్ర కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో వడ్డె సంఘం మండల అధ్యక్షుడు మహేష్, చిన్నరంగడు, గౌండ వెంకట, శివ, ఎల్లాగి, చినరాజు, రాము, గౌండ రాము తదితర ఆలయ నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం