BREAKING
రేపు చేవెళ్లలో పర్యటించనున్న సబితమ్మ పట్టభద్రుల ఓటు నమోదుకు యువత ముందుకు రావాలి : మాజీ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి బాపట్ల రూరల్ సీఐ గా రాంబాబు సరోగసీలో చట్టబద్ధతకు పెద్దపీట: డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె. ఆనంద్‌ గ్లోబల్ హిట్ వెబ్ సిరీస్ అరాఫ్తా షూటింగ్ అనుభవాలు పంచుకున్న టర్కిష్ నటులు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ మహిళా సంఘాల అభివృద్ధికి కృషి ఫ్లైదుబాయ్ పైలట్ సాహసాన్ని కొనియాడిన బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ గోవింద నామ స్వర్ణతో మారుమోగిన వెంకటనారాయణ నాట్యమండలి జిల్లా మహాసభలు జయప్రదం చేయాలి జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ డీప్‌‌ఫేక్ వీడియోపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు రైతులకు తమిళనాడు ప్రభుత్వం కొండంత అండ గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక మాజీ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకల్లో ఆర్‌బీఓఎల్ సీఈవో జాతీయస్థాయిలో సత్తా చాటిన ఉమామహేశ్వరపురం విద్యార్థిని.

సుందరమైన నగరాన్ని నిర్మిద్దాం -స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ -స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర ప్రజా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: మున్సిపల్ కమిషనర్ జయకృష్ణ

Select Suryaa Now
సుందరమైన నగరాన్ని నిర్మిద్దాం  -స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్  -స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర ప్రజా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: మున్సిపల్ కమిషనర్ జయకృష్ణ

మహాత్మా గాంధీ చూపిన సిద్ధాంతాలు, ఆశయాలకు అనుగుణంగా పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతకు ప్రాధాన్యతనిస్తూ గత 16 సంవత్సరాలుగా అక్టోబర్ 2న వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వచ్ఛత, సుందరీకరణ, వాయు కాలుష్య నివారణలో స్థానిక సంస్థలను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ లీగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు అవార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో తిరుపతి నగరం 2024, 2025 సంవత్సరాల్లో వరుసగా దేశవ్యాప్తంగా టాప్–3లో నిలవడం విశేషమని పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛతా హి సేవా అవార్డులు–2026లో భాగంగా తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించిన జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, తిరుపతి నగర పాలక సంస్థ కమీషనర్ జయకృష్ణ,  టిటిడి బోర్డు సభ్యులు మన బాక లక్ష్మి, గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ లతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా, స్వచ్ఛంగా తీర్చిదిద్దడం ద్వారానే స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందని, స్వచ్ఛాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద శ్రమదానం, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని యంత్రాలు, వాహనాలు సమకూర్చినా, యంత్రాంగం ఎంత సమర్థవంతంగా పనిచేసినా ప్రజల భాగస్వామ్యం లేకుండా స్వచ్ఛత సాధ్యం కాదని అన్నారు. ప్రజలు, వ్యాపారులు, హోటళ్లు, మార్కెట్లు, కార్యాలయాలు వ్యర్థాలను సక్రమంగా సేకరించి వర్గీకరించడంలో సహకరించాలని సూచించారు. తిరుపతి నగరంలో ప్రతిరోజూ సుమారు 250 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, ప్రస్తుతం 70 నుంచి 80 టన్నుల వ్యర్థాలను మాత్రమే స్థానికంగా ప్రాసెస్ చేయగలుగుతున్నామని, మిగిలిన వ్యర్థాలను శ్రీరామపురం డంపింగ్ యార్డుకు తరలిస్తున్నామని తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రతి ఇంటి నుంచే వ్యర్థాల వర్గీకరణ ప్రారంభం కావాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేరు చేసేందుకు రోజుకు కనీసం 10 నిమిషాల సమయం కేటాయించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. వ్యర్థాలను పూర్తిస్థాయిలో రీసైక్లింగ్, ప్రాసెసింగ్ చేసి ఎటువంటి అవశేషాలు మిగలకుండా నిర్వహించినప్పుడే నగరాన్ని పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా తీర్చిదిద్దగలమని తెలిపారు.

తిరుపతి జిల్లాలోని రామాపురంలో సుమారు రూ.300 కోట్లకు పైగా వ్యయంతో 600 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని, 2027 డిసెంబర్ లేదా 2028 జనవరి నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. తిరుపతితో పాటు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో వ్యర్థాల నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్లను అందుబాటులోకి తీసుకువచ్చి, రాబోయే రెండేళ్లలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చెత్త కుప్పలు లేకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పరిసరాల అపరిశుభ్రత వల్ల మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ప్రజలు తమ ఇళ్లు, వీధులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజలందరూ నిద్రించే సమయంలోనే విధులకు హాజరై నగరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు అసమానమైనవని జిల్లా కలెక్టర్ అభినందించారు. కార్పొరేషన్, పంచాయతీల పారిశుధ్య సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వారి ఆరోగ్య పరిరక్షణకు తరచూ హెల్త్ చెకప్‌లు నిర్వహించాలని అధికారులకు సూచించారు. విధుల సమయంలో పారిశుధ్య సిబ్బంది మాస్కులు, గ్లౌజులు, సేఫ్టీ కోట్లు తదితర రక్షణ పరికరాలను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. స్వచ్ఛత కోసం విశేష కృషి చేసిన కార్యాలయాలు, హోటళ్లు, ఎన్జీవోలు, విద్యాసంస్థలు, పారిశుధ్య సిబ్బందిని స్వచ్ఛతా హి సేవా అవార్డులు–2026తో సత్కరిస్తున్నామని, వారి సేవలు ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. గాంధీ జయంతి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, వీధి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ స్వచ్ఛాంధ్ర సాధనలో భాగస్వాములు కావాలని, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, సుందరమైన తిరుపతి నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

తిరుపతి నగరపాలక కమీషనర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛ భారత్ మిషన్’ స్ఫూర్తితో, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గార్ల ఆధ్వర్యంలో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు  తెలిపారు. స్వచ్ఛాంధ్ర సాధన ద్వారానే స్వర్ణాంధ్రప్రదేశ్ కల సాకారమవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా, ప్రతి ఇంటి నుంచి ప్రతి వీధి వరకు, నగరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమంగా మలచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సంపూర్ణ భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన నగరాన్ని నిర్మించుకోవడం సాధ్యమవుతుందని తెలిపారు.

జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహాత్మా గాంధీ ఆశయాలు, జీవిత సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని కోరారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను కూడా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. 2047 నాటికి ‘వికసిత భారత్’ సాధనలో భాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కమిషనర్ పిలుపునిచ్చారు. హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించి, పారిశుద్ధ్య నిర్వహణలో ఇతరులకు ఆదర్శంగా నిలవాలని, తిరుపతి నగరాన్ని పరిశుభ్రమైన, సుందరమైన నగరంగా తీర్చిదిద్దడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం జిల్లా స్థాయిలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వివిధ శాఖల సిబ్బందికి స్వచ్ఛతా హి సేవా అవార్డులను జిల్లా కలెక్టర్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సుశీల దేవి, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎన్జీవోలు, విద్యార్థులు, పారిశుధ్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి