BREAKING
జిన్నారం మున్సిపల్ బీజేపీ నూతన కమిటీ ఏర్పాటు పార్టీ పదవులు, అనుబంధ మోర్చాల అధ్యక్షుల నియామకం జిన్నారం మేజర్ న్యూస్:జిన్నారం మున్సిపల్ పరిధిలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నూతన మున్సిపల్ కమిటీతో పాటు అనుబంధ మోర్చాల అధ్యక్షులను నియమించారు. పార్టీ కార్యాలయంలో మున్సిపల్ బీజేపీ అధ్యక్ అద్దంకి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సర్వం సిద్ధం. మున్సిపల్ ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించాలి సౌదీ అరేబియాలోని అనేక ప్రాంతాలపై హూతీల దాడి యత్నం కురుమ యువ చైతన్య సమితి(కెవైసిఎస్) మునుగోడు నియోజకవర్గం ఇన్చార్జిగా బండారు శ్రీనివాస్ కురుమ నేటి నుండి నామినేషన్ లు. ఎన్నికల వేళ ఎక్సైజ్ శాఖ నిఘా: తనిఖీలు, పాత నేరస్తులకు హెచ్చరికలు. గురువారం సంతలో ఏ ఊరు వారైనా ఎవరైనా కొనుగోలు అమ్మకాలు చేయవచ్చు: సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ శివాలయం అవినీతి ఆరోపణలు నిరూపించండి నివాస ప్రాంతంలో అక్రమ గోల్డ్ రిఫైనరీ! దేశానికే ఆదర్శప్రాయుడు అబ్దుల్ కలాం -ఎమ్మెల్యే ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి :సబితా రెడ్డి వి.ఎస్.యూ.లో అబ్దుల్ కలాంకు ఘన నివాళి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలి స్థానిక ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల.

స్థానిక సంస్థల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి : ఎమ్మెల్యే ఏలూరి పిలుపు

Select Suryaa Now
స్థానిక సంస్థల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి  :  ఎమ్మెల్యే ఏలూరి పిలుపు

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ : 
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు. గురువారం పర్చూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ శ్రేణులంతా సోదరభావంతో, పరస్పర సమన్వయంతో పనిచేస్తూ తిరుగులేని విజయం సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. స్థానిక సంస్థల్లో అన్ని కులాలు, వర్గాలకు తగిన ప్రాధాన్యం కల్పించేలా పార్టీ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.పార్టీ విజయమే ధ్యేయంగా ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు, విభేదాలకు తావివ్వకుండా పార్టీ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే అంతిమమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని, ఎంపికైన అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 
ప్రతి కార్యకర్తను కలుపుకొని ముందుకు సాగుతూ, ఐక్యతను బలంగా చాటాలని ఏలూరి పిలుపునిచ్చారు. సమన్వయం, క్రమశిక్షణ, సమష్టి కృషితో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించేలా పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే కార్యాచరణకు సిద్ధం కావాలని అన్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఖాజా ఖిజర్ మహల్ జేఆర్కే సినిమా హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇరుముడి సినిమాను తిలకించారు.
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిబాష, ఇంకొల్లు.