కురుమ యువ చైతన్య సమితి(కెవైసిఎస్) మునుగోడు నియోజకవర్గం ఇన్చార్జిగా బండారు శ్రీనివాస్ కురుమ
మునుగోడు,మేజర్ న్యూస్: కురుమ యువ చైతన్య సమితి (కేవైసీఎస్) రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం, నల్లగొండ జిల్లా కురుమ యువ చైతన్య సమితి అధ్యక్షులు బండారు శంకర్ కురుమ గురువారం అధికారికంగా కేవైసీఎస్ మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా బండారు శ్రీనివాస్ కురుమని నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ కురుమ మాట్లాడుతూ కేవైసీఎస్ బలోపేతానికి నియోజకవర్గ వ్యాప్తంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.తన నియమానికి సహకరించిన రాష్ట్ర,జిల్లా ,మండల కురుమ యువ చైతన్య సమితి నాయకలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కేవైసిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కుండే వెంకటేష్ కురుమ ,కేవైసీఎస్ ఉపాధ్యక్షులు మందుల సత్యం కురుమ, వర్కింగ్ ప్రెసిడెంట్ మోటే రవి కురుమ, కోశాధికారి రావుల ఐలయ్య కురుమ,కేవైసీఎస్ జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.