స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ ఫోకస్
అమరావతి:రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో పార్టీ లీగల్ సెల్ సభ్యులతో ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమై కీలక దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో సజ్జల మాట్లాడుతూ... స్థానిక ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు లీగల్ సెల్ ఒక రక్షణ కవచంలా నిలవాలని స్పష్టం చేశారు. జిల్లా మరియు నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లు, వార్‌రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి కౌంటింగ్ ముగిసే వరకు ప్రతి దశలోనూ అభ్యర్థులకు న్యాయపరమైన అండదండలు అందించాలని లీగల్ సెల్ బృందానికి సూచించారు.