BREAKING
జెడ్పీటీసీ నామినేషన్ల తిరస్కరణపై అప్పీళ్ల స్వీకరణ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నాగర్ కర్నూలు ఎమ్మెల్యేల హామీ రేణిగుంట సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని మృతదేహం ముంబై బాలీవుడ్ మ్యూజిక్ ప్రాజెక్ట్‌లో సింగర్ శిల్పా రావుకు చేదు అనుభవం.. మధ్యలోనే షో ఆపేయడంతో అభిమానుల ఆగ్రహం! చెన్నై థియేటర్‌లో అభిమానులతో కలిసి ‘జైలర్ 2’ చూసిన రజనీకాంత్.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ! పత్తి చేనులో అంతర పంటగా గంజాయి సాగు జోడేఘాట్‌కు బయలుదేరిన కుంరం భీo కుటుంబ సభ్యులు ఎఫ్‌సీఐ డిపోలో స్వచ్ఛతా అభియాన్‌ బీజేపీ కార్యకర్తలతో పాటు మన్ కి బాత్ వీక్షించిన ఎంపీ అరుణ 14వ వార్డులో డి. నజీర్ అహమ్మద్ ప్రజలతో ముఖాముఖి ఆదరించండి..అండగా ఉంటా.. -కొత్తపల్లి ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి జగదీష్ రేపే ‘అర్నాబ్’ తుఫాన్‌గా తీవ్రరూపం * ఏపీకి 3 రోజుల పాటు భారీ వర్ష సూచన.. అభిమానులతో ఆత్మీయ కలయికలో పాల్గొన్న ఎం వి ఆర్ పరిణీతి చోప్రా సంచలన వ్యాఖ్యలు.. విమానంలో ఒంటరిగా ఏడ్చిన క్షణాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగం!

స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు జంగారెడ్డిగూడెంలో పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన ఐజీ, జిల్లా ఎస్పీ

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు  జంగారెడ్డిగూడెంలో పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన ఐజీ, జిల్లా ఎస్పీ

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్,జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు చేపడుతున్న భద్రతా ఏర్పాట్లను ఏలూరు రేంజ్ ఐజీ జి.వి.జి. అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలతో పాటు ఓట్ల లెక్కింపు కేంద్రాలు, మార్కెట్ యార్డ్, నోవా కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఘర్షణలు, ఉద్రిక్తతలకు అవకాశం లేకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.అనంతరం జంగారెడ్డిగూడెం డివిజనల్ పోలీసు కార్యాలయంలో సబ్‌డివిజన్ పోలీసు అధికారులతో ఐజీ, ఎస్పీ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన విధివిధానాలు, బందోబస్తు ప్రణాళికలు, సమస్యాత్మక ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.ఈ సమావేశంలో జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకటేశ్వర్లు, పట్టణ ఇన్‌స్పెక్టర్ ఎం.వి. సుభాష్, స్థానిక ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 రిపోర్టర్ కెవి రమణారావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా,