BREAKING
మెట్టెక్కివలస ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్లు అందజేత ఘనంగా ప్రారంభమైన దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నర్సీపట్నం మున్సిపాలిటీలో పోలింగ్ కేంద్రాల పరిశీలన " సామాజిక సేవ నుండి ప్రజా క్షేత్రం వైపు " శివాలయంలో శరన్నవరాత్రుల ప్రారంభం అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ నాయకులు తాటి బాలు త్రివిధ దళాల మాజీ సైనికులతో బిజెపి రాష్ట్ర చీఫ్ సమావేశం.. బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంలో పోలమాంబ దర్శనం రైలు ఢీకొని 130 గొర్రెలు మృతి! 26వ వార్డులో రూ. 40 లక్షలతో కళ్యాణ మండపానికి శంకుస్థాపన అన్నదాన కార్యక్రమానికి రూ.లక్ష విరాళం లయన్స్ క్లబ్ సౌజన్యంతో విజ్ఞాన భారతిలో మొక్కలు నాటే కార్యక్రమం.. మినీ గురుకులాల సిబ్బందిని రెగ్యులర్ చేయాలి ఆలయాన్ని సందర్శించిన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి. * చారిత్రక సంపదను కాపాడుకోవడం భక్తుల బాధ్యత బుధవారం నాడు జాబ్ మేళా

స్థానిక సమరానికి పోలీస్ బందోబస్తు సిద్ధం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల తనిఖీ.. సమస్యాత్మక వ్యక్తులపై ప్రత్యేక నిఘా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్

Select Suryaa Now
స్థానిక సమరానికి పోలీస్ బందోబస్తు సిద్ధం  జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల తనిఖీ.. సమస్యాత్మక వ్యక్తులపై ప్రత్యేక నిఘా  అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు  జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్

అనంతపురం బ్యూరో : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అనంతపురం జిల్లా పోలీస్ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.

గ్రామాల్లో ప్రజలకు అవగాహన

ఎన్నికల నేపథ్యంలో పలు గ్రామాల్లో పోలీస్ అధికారులు ప్రజలతో సమావేశమై శాంతియుత ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో చట్టాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని, ప్రలోభాలకు లోనుకాకుండా నిబంధనలను పాటించాలని సూచించారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు.

సమస్యాత్మక వ్యక్తులపై ప్రత్యేక నిఘా

ఎన్నికల సమయంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించే వ్యక్తులు, గతంలో సమస్యలకు కారణమైన వారిపై ప్రత్యేక నిఘా ఉంచనున్నట్లు పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా అవసరమైన వారిపై బైండోవర్ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

పటిష్ట బందోబస్తుతో ఎన్నికల నిర్వహణ

జిల్లావ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వారీగా భద్రతా పరిస్థితులను అంచనా వేస్తూ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ యంత్రాంగం వెల్లడించింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ముందస్తు చర్యలను మరింత పటిష్టం చేస్తున్నట్లు పేర్కొంది.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.