BREAKING
ఐదు సొసైటీల్లో పదవుల భర్తీపై ఆసక్తి.. సామాజిక సమీకరణాల చుట్టూ చర్చలు చికిత్స పొందుతూ వ్యక్తి మృతి డీసీఎం ఢీ కొట్టిన ఘటనలో మృత్యు ఒడిలోకి మూడో వ్యక్తి హెచ్‌ఐవీ నియంత్రణలో 95-95-95 లక్ష్యాల సాధనకు ప్రత్యేక కార్యాచరణ* *మొదటి రెండు లక్ష్యాలను 100 శాతానికి చేర్చేలా చర్యలు చేపట్టాలి* *మొబైల్ ఐసీటీసీ వాహనాల ద్వారా విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి* స్వర హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం గురువే సమాజ ప్రగతికి పునాది 'ఫీల్ గుడ్' చిత్రం నుండి యూత్‌ఫుల్ మెలోడీ 'మమ్మా మియా' పాట విడుదల జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ 125 రోజులు పని పొందాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా శివపూర్ గ్రామంలో ఘనంగా వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం - చైర్మన్ నాగం గంగారం మూడు నామినేషన్లు తిరస్కరణ రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో పీఎం రాహత్ పథకం కీలక పాత్ర పోషిస్తుంది : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మృత సర్పంచ్ కుటుంబానికి అండగా ఉంటా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పరిషత్తు పోరు"నామినేషన్" సక్రమం...ఇక అసలైన సమరం! కీర్తి సురేష్, రాధికా ఆప్టేల ‘అక్క’ ట్రైలర్ విడుదల: అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల విద్యార్థులు మాదాకద్రవ్యాలకు దూరంగా ఉండాలి అగ్రిగోల్డ్ బాధితుల నుండి బాండ్లు సేకరణ.. * పోలీస్ బ్యారెక్స్ కళ్యాణ మండపం వద్ద బారులు తీరిన బాధితులు *

స్మగ్లర్ల పై టాస్క్ ఫోర్స్ దాడి -61 ఎర్రచందనం దొంగలు పట్టివేత -8 మంది స్మగ్లర్లు తో పాటు ట్రాక్టర్ రెండు కార్లు సీజ్

Select Suryaa Now
స్మగ్లర్ల పై టాస్క్ ఫోర్స్ దాడి  -61 ఎర్రచందనం దొంగలు పట్టివేత  -8 మంది స్మగ్లర్లు తో పాటు ట్రాక్టర్ రెండు కార్లు సీజ్

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : నెల్లూరు జిల్లా గూడూరు అటవీ పరిధిలో ఎర్రచందనం స్మగ్లర్లపై రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీ దాడి నిర్వహించారు. 61 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, 8 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్.సుబ్బారాయుడు కార్యాచరణ మేరకు, టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో, డీఎస్పీ ఎండీ షరీఫ్ మార్గనిర్దేశకత్వంలో ఆర్ఐ కృపానంద, ఎఫ్ఆర్వో సుభాష్ బృందం శుక్రవారం గూడూరు అటవీ ప్రాంతానికి చేరుకుంది. కొండగుంట-మేకనూరు మార్గంలో వెళుతుండగా అలికిడి వినిపించడంతో అటువైపు వెళ్లి చూడగా, ఎర్రచందనం దుంగలు కలిగిన ట్రాక్టర్ తో కొంతమంది కనిపించారు. సమీపంలో రెండు కార్లు ఉండటంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని చుట్టుముట్టారు. ట్రాక్టర్ లో 24, కింద 22 దుంగలు కలిపి 46 దుంగలను మొదట స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మరో ప్రాంతంలో దాచి ఉంచిన మరో 15 దుంగలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 61 దుంగలు, రెండు కార్లు, ఒక ట్రాక్టర్ సీజ్ చేసి 8 మందిని అరెస్ట్ చేసి తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన వారిని డీఎస్పీ వీ.శ్రీనివాసులు రెడ్డి విచారించారు. సీఐ ఖాదర్ భాష కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్