35వ డివిజన్‌లో బంగి నాగ విస్తృత ప్రచారం.. టీడీపీ అభ్యర్థికి కార్యకర్తలు, నాయకులు, అభిమానుల మద్దతు.. ఇంటింటా ప్రచారంతో ఎన్నికల హోరు..
(అనంతపురము, కార్పొరేషన్ మేజర్ న్యూస్:)
అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 35వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బంగి నాగ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, అభిమానులతో కలిసి డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓటర్లను కలుసుకుంటున్నారు.
ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని బంగి నాగ అభ్యర్థిస్తున్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ప్రచారాన్ని ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తున్నారు.
ప్రచార సమయంలో ప్రజల నుంచి లభిస్తున్న స్పందనతో బంగి నాగ తన ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. డివిజన్‌లో ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల బరిలో ముందుకు సాగుతున్నారు. 35వ డివిజన్‌లో టీడీపీ శ్రేణుల ప్రచారంతో ఎన్నికల సందడి నెలకొంది.