స్కూల్ మేనేజ్మెంట్ అకౌంట్లు ఆడిట్ షెడ్యూల్ వాయిదా వేయాలి
చిత్తూరు జిల్లా ఫ్యాక్టో నాయకులు
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్.ప్రస్తుత తరుణంలో ఉపాధ్యాయులకు పాఠశాలకు సంబంధించినపరీక్షలు, వాటి వాల్యూషన్ స్థానిక సంస్థల ఎన్నికల డ్యూటీల నేపథ్యంలో స్కూల్ మేనేజ్మెంట్ అకౌంట్లు ఆడిట్ షెడ్యూల్ వాయిదా వేయాలని కోరినప్పటికీ సమగ్ర శిక్ష అధికారులు నిరంకుశంగా ఆడిట్ జరిపిస్తున్నారు.
ఈ విషయాన్ని ఫ్యాప్టో చిత్తూరు జిల్లా యూనిట్ పక్షాన ఖండిస్తున్నామని ఫ్యాప్టో చైర్మన్ ఎన్.మణిగండన్ తెలియజేశారు.అలాగే స్కూల్ గ్రాంట్స్ విత్ డ్రా విధానం సరళీకరణం చేయాలని కోరినా వారు అనుకున్న పద్ధతినే ఏకపక్షంగా అమలు చేస్తున్నారు. ఫ్యాప్టో జిల్లా యూనిట్ నాయకులు అన్నారు.ఈ నేపథ్యంలో ఎస్ ఎం సి అకౌంట్స్ ఆడిట్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని జిల్లాలోని అన్ని సంఘాలు జిల్లా విద్యా శాఖాధికారి కె.లక్ష్మీనారాయణ కి, సమగ్ర శిక్ష ఏపీసి శ్రీ ఎం.వెంకటరమణకి
తెలియజేస్తూ ఆడిట్ ని బహిష్కరిస్తూ ఫ్యాప్టో పక్షాన నోటీసులు ఇవ్వడం జరిగింది,
ప్రభుత్వానికి ఆడిట్ కి సంబంధించి వెండర్ విధానం లో వర్కులు కంప్లీట్ చేయించడం ఇబ్బందికరమని ఇప్పటికే అనేక మార్లు ప్రాతినిధ్యం చేశామని ఇటువంటి కార్యక్రమాలపై కూడా ఫ్యాప్టో చిత్తూరు జిల్లా పక్షాన ఖండిస్తున్నామని ఉపాధ్యాయ సంఘ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో రాష్ట్ర నాయకులు జీవీ రమణ, చిట్టిబాబు జిల్లా ఫ్యాప్టో నాయకులు గిరిబాబు యాదవ్, ముక్తారహ్మాద్, జగదీష్, ఎస్పీ బాషా, సదాశివరెడ్డి,చంద్రన్ , ఢిల్లీ బాబు, అఫ్జల్ బాషా, గోపి తదితరులు పాల్గొన్నారు
ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.