BREAKING
హెచ్-1బీ నుంచి పీఈఆర్‌ఎం ద్వారా గ్రీన్ కార్డ్ పొందే ఉద్యోగుల సంఖ్య పరిమితమే: నాస్కామ్ కీలక ప్రకటన! ముక్కామల గ్రంథాలయంలో అడవి బాపిరాజు 131వ జయంతి వేడుకలు అర్హులైన ప్రతి ఓటరుకు ఓటర్ల జాబితాలో చోటు కల్పించాలి..జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి మహేష్ కుమార్ గోటేటి రామమూర్తి కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా కలెక్టర్.. ముక్కామల జాతీయ రహదారి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్.. క్షయ వ్యాధి నిర్మూలన పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి..:జిల్లా జాయింట్ కలెక్టర్ నైడియా దేవి. లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా మద్యం షాపుల లైసెన్సులు.... జిల్లా రెవెన్యూ అధికారి సుబ్బారావు.. వైసీపీ గెలుపునకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి.. కొల్లు త్రినాధ వర్మ.. స్పైస్‌జెట్‌కు ఊరట: ఇండియన్ బ్యాంక్ నుంచి రూ. 150 కోట్ల తొలి విడత ఈసీఎల్‌జీఎస్ నిధులు విడుదల! వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్రం అభ్యంతరం: జీఎస్టీ కౌన్సిల్ భేటీ: ఫేస్‌లెస్, పారదర్శక పన్ను విధానం దిశగా కీలక అడుగు...కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన! పోర్ట్స్ క్యూ2 ఫలితాల ప్రివ్యూ: అంతరాయాలున్నా సానుకూలంగానే కార్గో అవుట్‌లుక్.. విదేశీ ఐటీ ఔట్‌సోర్సింగ్ సంస్థలపై యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం: మణిపూర్‌లో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి మద్దతు .. త్రికోట శివాలయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం*

సిద్ధార్థలో షటిల్ సమరం.. సత్తా చాటేందుకు 40 జట్ల పోటీ

Select Suryaa Now
సిద్ధార్థలో షటిల్ సమరం.. సత్తా చాటేందుకు 40 జట్ల పోటీ

విజయవాడ స్పోర్ట్స్, మేజర్ న్యూస్ : విజయవాడలోని సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వై.వి. రావు సిద్ధార్థ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జేఎన్‌టీయూకే అంతర్ కళాశాల సెంట్రల్ జోన్ షటిల్ బ్యాడ్మింటన్ పురుషుల, మహిళల టోర్నమెంట్, ఎంపిక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సిద్ధార్థ అకాడమీ ప్రోవైస్ చాన్సలర్, వీఆర్‌ఎస్‌ఈసీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎ.వి. రత్న ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్‌ను ప్రారంభించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని, క్రీడాకారులు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. అకాడమీ రిజిస్ట్రార్ డా. ఎం. రవిచంద్ క్రీడాకారులు, జట్లకు శుభాకాంక్షలు తెలిపారు. టోర్నమెంట్‌లో 26 పురుషుల జట్లు, 14 మహిళల జట్లతో మొత్తం 40 జట్లు పాల్గొంటున్నాయి. క్రీడాకారులు, అధికారులకు న్యాయమైన పోటీతో పాటు ఆహ్లాదకరమైన క్రీడా వాతావరణం కల్పించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్, నిర్వహణ కార్యదర్శి పి. రఘు, అధికారులు, కోచ్‌లు, జట్టు నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. టోర్నమెంట్ నిర్వహణకు సహకరిస్తున్న జేఎన్‌టీయూకే క్రీడా బోర్డు, విద్యాసంస్థలు, యూనివర్సిటీ యాజమాన్యానికి రఘు కృతజ్ఞతలు తెలిపారు.

✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.