BREAKING
కోల్ ఇండియా స్థాయి క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించాలి బంగారం కోసం వృద్ధురాలి హత్య కేసు... -- ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా మంత్రి శ్రీధర్ బాబు సర్పంచ్ అభ్యర్థులతో పోలీసుల ఎన్నికల అవగాహన సమావేశం ఇంటింటికీ మెరుగైన వైద్యం అందేలా పనిచేయాలి గొట్టిపల్లి సర్పంచ్‌గా అవ్వ తేజేశ్వరి ఏకగ్రీవ ఎన్నిక.. గత ప్రభుత్వ హయాంలోనే హుజురాబాద్ అభివృద్ధి -- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పూర్ణిమకు మద్దతుగా మహిళల భారీ ర్యాలీ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థిని ఎంపిక ఆర్థిక సహాయం...... మేజర్ పంచాయతీ పోరు రసవత్తరం.. భూ వివాదాలకు తావులేని గ్రామాలే లక్ష్యం. తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి 14-15 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహణ గిజబ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన మరడాన ఉషారాణి

నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే ఆత్మీయ సత్కారం

Select Suryaa Now
నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే ఆత్మీయ సత్కారం

గరుగుబిల్లి, నవంబర్ 27, మేజర్ న్యూస్:గరుగుబిల్లి మండలం కొత్తూరు గ్రామ పంచాయతీకి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ అన్ను పకీరు, ఉప సర్పంచ్ ఏగిరెడ్డి సింహాచలంనాయుడు మరియు వార్డు సభ్యులు కూటమి నాయకులతో కలిసి కురుపాం నియో జకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ మేరకు గుమ్మలక్ష్మీపురంలోని శాసనసభ్యులు తోయక జగదీశ్వరి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో కూటమి నాయకులు.ఏగిరెడ్డి తిరుపతినాయుడు, పెద్దింటి శ్రీధర్, ఏగిరెడ్డి సింహాచలమునాయుడు, ద్వారపురెడ్డి రమేష్, బడే రవికుమార్ తో పాటు నూతన పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛాలు అందించి కృతజ్ఞతలు తెలిపారు.ఈసందర్భంగా తోయక జగదీశ్వరి నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యు లను శాలువాలతో సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.అనంతరం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో కట్టబెట్టిన ఈబాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువ చేస్తూ, కొత్తూరు గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.గ్రామ అభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని శాసనసభ్యులు తోయక జగదీశ్వరి హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో కూటమి నాయకులు ఏగిరెడ్డి తిరుపతినాయుడు,పెద్దింటి శ్రీధర్ ఏగిరెడ్డి సింహాచలంనాయుడు, ద్వారపురెడ్డి శంకర్రావు (రమేష్), బడే రవికుమార్,కొత్తూరు నూతన సర్పంచ్ అన్ను పకీరు,వార్డు సభ్యులతో పాటు కూటమి నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు