BREAKING
బెల్జియం ట్యాక్స్ ఏజెన్సీపై సైబర్ దాడి కలకలం.. ఆన్‌లైన్ పోర్టల్ తాత్కాలిక నిలిపివేత ఆర్నబ్ తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి....ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్... మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కసిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీలను అభినందిస్తున్న ..ఎంపీ శబరి..! ఎయిర్‌ కెనడా, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానయాన ఒప్పందం ప్రధాని మోదీపై ఖర్గే వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ దళిత మోర్చా నేత నింగ్యారి యాదగిరి* సైబర్ నేరాల పట్ల యువత అవగాహన కలిగి ఉండాలి* 2030 లక్ష్య సాధనకు భారత్ బృహత్తర ప్రణాళిక ఏఐ ట్రైనింగ్ వర్కర్లపై చట్టవిరుద్ధ నిఘా ఆరోపణలను ఖండించిన స్కేల్ ఏఐ రక్తదానం గొప్ప సామాజిక సేవకు ప్రతీక పెరుగుతున్న వాతావరణ ముప్పుపై భీమా రంగం హెచ్చరిక శివన్నగూడెం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి.. ఉమ్మడి నల్లగొండ రైతులకు నీటి భరోసా కల్పించాలి! చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అమెరికా వ్యాపార దిగ్గజాల కీలక డిమాండ్..రాజకీయ స్థిరత్వం, సుస్థిర ఆర్థిక విధానాలే ప్రాధాన్యత తుఫాన్ వర్షాలకు పెద్దూరులో కూలిన ఇంటి స్లాబ్

శ్రీకాకుళం జిల్లా చరిత్రలోనే ఇది చీకటి రోజు!

Select Suryaa Now
శ్రీకాకుళం జిల్లా చరిత్రలోనే ఇది చీకటి రోజు!

శ్రీకాకుళం, సూర్య : ఆమదాలవలస నియోజకవర్గం, పొందూరు మండలంలో స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతూ, ఫోర్జరీ సంతకాలతో 5 ఎంపీటీసీ స్థానాలను అక్రమంగా ఏకగ్రీవం చేసుకున్న తీరు అత్యంత గర్హనీయమని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రజాక్షేత్రంలో వైయస్సార్‌సీపీని ఎదుర్కొనే దమ్ము లేక, ఓటమి భయంతో దొడ్డిదారిన ఈ నీచ రాజకీయాలకు తెరతీశారన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి అధికార బలంతో అక్రమాలకు పాల్పడటం కూన రవికుమార్ అనాగరిక రాజకీయాలకు నిదర్శనం. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి, రిటర్నింగ్ అధికారులను అడ్డంపెట్టుకుని అర్ధరాత్రి వరకు డ్రామాలు నడిపించి ఏకగ్రీవాలు ప్రకటించుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రశాంతమైన శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి అప్రజాస్వామిక సంస్కృతికి పాల్పడుతున్న కూన రవికుమార్ లాంటి నాయకులు ప్రజాస్వామ్యానికి అనర్హులు, వీరు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఈ అక్రమ ఏకగ్రీవాలపై ఫోర్జరీ సంతకాల వెనుక ఉన్న అధికారుల పాత్రపై సమగ్రంగా, పూర్తిస్థాయిలో ఉన్నత స్థాయి విచారణ జరపాలి. తప్పు చేసిన ప్రతి ఒక్కరిపై, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి బెదిరింపులకు, అక్రమాలకు వైయస్సార్‌సీపీ భయపడదు. ఈ దౌర్జన్యాలపై న్యాయపోరాటం చేస్తూ, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి దోషుల భరతం పడతాం. ప్రజలే వీరికి తగిన సమయంలో తగిన గుణపాఠం చెబుతారు. బియ్యం బస్తా రూ.2600, కిలో ఉల్లి రూ.60, నూనె రూ.200 దాటి నిత్యవసర ధరలు పరుగులు పెడుతున్నాయని, ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకొని ఈ ప్రభుత్వాన్ని ఓటు ద్వారా తరిమికొట్టాలని కృష్ణదాస్ పిలుపునిచ్చారు. 

రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.