BREAKING
గోవాడ గ్రామంలో పొలం బడి. న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్జి లలితాదేవి ఘనంగా అడివి బాపిరాజు జయంతి వేడుకలు నేటి నుండి ఇంటింటికి వెళ్లి ఓటర్ల పరిస్థితిని పునః పరిశీలించాలి విజయ్ దేవరకొండ రణబాలి మూవీ వెనుక అసలు కథ ఇదే.. డైరెక్టర్ రాహుల్ ఆసక్తికర విషయాలు 2027 మార్చి నాటికి భూసమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం మంత్రి కొలుసు పార్థసారథి లోక్ భవన్ ముట్టడిలో పాల్గొన్న రంగారెడ్డి DCC చీఫ్ పారిజాత ఆస్తుల ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి,నేషనల్ పీపుల్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ డిమాండ్ దేశం నేత నాయుడుకు వినతి పత్రం అందజేసిన వీఆర్ఏలు అద్దంకిలో మహిళా సాధికారత, చట్టాలపై అవగాహన ర్యాలీ. కభ్రస్థాన్ సమస్యకు పరిష్కారం - కలెక్టర్ దివాకర భూ భారతిలొ భూ రీ-సర్వే ను పకడ్బందీగా చేపట్టాలి భవన నిర్మాణ కార్మికులు వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలి ---సహాయ కార్మికాధికారి గోపీ కుమార్. సీఐ అలీ కుటుంబానికి 13 లక్షల 50 వేలు ఆర్థిక సాయం ఏపీ తెలంగాణ 1996 బ్యాచ్ పోలీస్ అధికారుల వితరణ శిథిలావస్థలో జూలూరుపాడు గ్రంథాలయం

శోభాయమానంగా దక్షిణామూర్తి ప్రాకారోత్సవం

Select Suryaa Now
శోభాయమానంగా దక్షిణామూర్తి ప్రాకారోత్సవం

 అత్యంత వైభవంగా ప్రదోషకాల అభిషేక పూజ

నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్  :   నెల్లూరు నగరంలోని చారిత్రాత్మక, ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి దేవస్థానంలో గురువారాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. గురు గ్రహ దోష నివారణకు, జ్ఞాన ప్రాప్తికి ఆరాధ్యుడైన దక్షిణామూర్తి స్వామికి విశేష పూజలతో పాటు ఆలయ ప్రాకారోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.గురువారం ఉదయం స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు చేసిన అనంతరం, ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారి ఆలయ ప్రాకారోత్సవం కన్నుల పండువగా సాగింది. సాయంత్రం త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రదోషకాల పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మూలస్థానేశ్వర స్వామికి, నందీశ్వర స్వామికి వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వివిధ రకాల విశేష ద్రవ్యాలతో ఘనంగా అభిషేకాలు నిర్వహించారు. ఈ విశేష ఉత్సవాన్ని ఆలయ ఛైర్మన్ , పాలక మండలి సభ్యులు, సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి ఏవీ శ్రీనివాసులు రెడ్డి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు.