సేవా సంకల్ప్ అభియాన్ మెగా మెడికల్ క్యాంపు..
గుండె సంబంధిత సమస్యలకు ఉచిత వైద్య పరీక్షలు*
*రోగుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి*
గిద్దలూరు మేజర్ న్యూస్ :
*గిద్దలూరు: దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా గిద్దలూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. నంద్యాలకు చెందిన శాంతిరాం ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది సహకారంతో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు వైద్య శిబిరాన్ని పరిశీలించి, పరీక్షలు చేయించుకుంటున్న రోగుల వద్దకు స్వయంగా వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.*
*ఆసుపత్రికి వచ్చిన రోగులను ఆప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలు, అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది పనితీరుపై ఆరా తీసి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి ప్రధాని నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మెడికల్ క్యాంపు నిర్వహణలో భాగస్వాములైన ఆసుపత్రి సిబ్బందిని శాలువాలతో సన్మానించారు.*
*ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.*