BREAKING
శ్రీ కోటదుర్గ ఆలయం లో గోడ పత్రిక విడుదల కొత్తపల్లి,రావుపల్లి గ్రామాల అంగన్వాడీ వర్కర్లకు సత్కారం మండల విద్యాశాఖ అధికారులకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించిన డీఈవో స్థానిక సంస్థల ఎన్నికలకు స్ట్రాంగ్ రూమ్ పరిశీలన తెగిపోయిన చేతికి మళ్లీ ప్రాణం… పీఎంశ్రీ పాఠశాలల్లో.. ప్రత్యేక అతిథి విద్యాబోధకుల నియామకం ఆటో ద్విచక్ర వాహనం ఢీ ఒకరికి గాయాలు.... చిగురుకోట జడ్పీ హైస్కూల్ ను పరిశీలించిన ఎస్ఎంసి చైర్మన్ దండే లక్ష్మి పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన కనిగిరి చేరిన బ్యాలట్ బాక్స్ లు కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి కొత్త చిత్రం హైకూ ట్రైలర్ రిలీజ్.. అక్టోబర్ 23న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్! జోగింపేట గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించిన ఏవో ఎస్ అవినాష్ అయోడిన్ లోపంతో పిల్లల ఎదుగుదలపై ప్రభావం శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో వరుణయాగం వరిలో ఎద పద్ధతితో సాగు ఖర్చు తగ్గుతుంది ... ఏవో ఎస్ అవినాష్.

సేవా సేతు అభియాన్ ” క్యాంపులు.... రూఫ్‌టాప్ సోలార్‌పై ప్రజలకు అవగాహన

Select Suryaa Now
సేవా సేతు అభియాన్ ” క్యాంపులు....  రూఫ్‌టాప్ సోలార్‌పై ప్రజలకు అవగాహన

ఈనెల   7, 8, 9 తేదీల్లో “...  సేవా సేతు అభియాన్ ” క్యాంపులు....  రూఫ్‌టాప్ సోలార్‌పై ప్రజలకు అవగాహన   రూ.78 వేల వరకు సబ్సిడీ... అన్ని సబ్ డివిజన్లలో క్యాంపుల నిర్వహణ...  విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీరు పి సుధాకర్ వెల్లడి..

నెల్లూరు/వేదాయపాలెం, మేజర్ న్యూస్  :  ఏపీ.దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 6, 7, 8 తేదీల్లో “సేవా సేతు అభియాన్” క్యాంపులను నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీరు  పి సుధాకర్ తెలిపారు. మంగళవారం స్థానిక విద్యుత్ భవన్ నందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “ప్రతి ఇంటికి సౌర విద్యుత్‌ను చేరువ చేయడం,రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన కల్పించడమే సేవా సేతు అభియాన్ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.ఇంటి పైకప్పుపై సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవడం వల్ల వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను గణనీయంగా తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా అర్హత కలిగిన గృహ వినియోగదారులకు  రూ.78 వేల వరకు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ
పథకం వర్తిస్తుందన్నారు. అర్హత కలిగిన గృహ వినియోగదారులకు:
1 కిలోవాట్‌కు రూ.30,000
2 కిలోవాట్లకు రూ.60,000
3 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి గరిష్ఠంగా రూ.78,000
వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందని తెలిపారు.
క్యాంపుల్లో పూర్తి సమాచారం…

“సేవా సేతు అభియాన్” క్యాంపుల ద్వారా ప్రజలకు పథకం అర్హతలు, దరఖాస్తు విధానం, సబ్సిడీ పొందే ప్రక్రియ, రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు, నెట్ మీటరింగ్ తదితర అంశాలపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.  ఈ క్యాంపుల్లో బ్యాంకర్లు, సోలార్ విక్రేతలు, డివిజన్ అధికారులు పాల్గొని వినియోగదారుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు పథకం అమలుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించనున్నారు.  
ప్రతి ఇంటినీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చడమే లక్ష్యం  :  అర్హత ఉన్న ప్రతి గృహ వినియోగదారుడు పీఎం సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని తన ఇంటినే విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చుకోవాలని తెలిపారు.  రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడం తోపాటు స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.  జిల్లా పరిధిలోని సబ్ డివిజన్, జిల్లా స్థాయిలో సేవా సేతు కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి, పథకం ప్రయోజనాలను అర్హులైన ప్రతి గృహ వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని  తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని పెద్ద సంఖ్యలో సేవా సేతు క్యాంపులను సందర్శించి రూఫ్‌టాప్ సోలార్‌పై పూర్తి సమాచారాన్ని తెలుసు కోవాలని.. పథకం ప్రయోజనాలను పొందాలని కోరారు.  పీఎం సూర్య ఘర్ పథకం లేదా సేవా సేతు క్యాంపులకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే ఏపీ ఎస్పీడిసియల్ 1912 కాల్ సెంటర్‌ను సంప్రదించి సమాచారం పొందవచ్చని తెలిపారు.