సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలిచిన ఖాసాపేట సర్పంచ్ కోళ్ల హసీతా నాయుడు తన జన్మదిన వేడుకలను
పెందుర్తి లో శ్రీ మణి ప్రకాష్ చారిటబుల్ వెల్ఫేర్ సొసైటీ జరుపుకున్న సర్పంచ్
లక్క వరపు కోట నవంబర్ 28 మేజర్ న్యూస్ :- ఖాసాపేట గ్రామ సర్పంచ్ గా నూతనంగా ఏకగ్రీవం గా ఎన్నిక అయినా ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పెద్ద కుమార్తె కోళ్ల హసీతా నాయుడు తన జన్మదిన వేడుకలను శ్రీ మణి ప్రకాష్ చారిటబుల్ వెల్ఫేర్ సొసైటీలో ఘనంగా నిర్వహించారు. తన జన్మదినాన్ని కేవలం వ్యక్తిగత వేడుకగా కాకుండా, సమాజంలోని నిరుపేదలు, అనాథ పిల్లలు, దివ్యాంగుల మధ్య జరుపుకుంటూ వారికి అండగా నిలవాలనే గొప్ప ఆలోచనతో ఆమె ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పలువురి ప్రశంసలు అందుకుంటోంది.
సాధారణంగా చాలామంది నాయకులు తమ జన్మదిన వేడుకలను ఆడంబరాలు, విందులు, వినోద కార్యక్రమాలతో నిర్వహిస్తూ అధిక మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. అయితే అందుకు భిన్నంగా తన పుట్టినరోజు సందర్భంగా సమాజంలో ఆదరణకు నోచుకోని అనాథ పిల్లలు, పేదలు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వారి మధ్య ఆనందాన్ని పంచుకోవడం ఆమె ప్రత్యేక ఆలోచనా విధానానికి నిదర్శనంగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తన సంతోషంలో సమాజంలోని బలహీన వర్గాలను భాగస్వాములను చేసుకోవాలనే ఆలోచన, అవసరంలో ఉన్నవారికి తోడుగా నిలవాలనే తపన నిజంగా అభినందనీయమని నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఆమె పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక బాధ్యత పట్ల తనకున్న నిబద్ధతను చాటుకున్నారు.
ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత ప్రజల సమస్యలపై స్పందించడమే కాకుండా, సమాజంలోని నిరుపేద వర్గాల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలవడం కూడా ఎంతో ముఖ్యమని ఆమె చేపడుతున్న కార్యక్రమాలు తెలియజేస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు.
పుట్టినరోజు అంటే కేవలం కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకోవడం మాత్రమే కాదు.. మన ఆనందంలో మరొకరి కళ్లలో చిరునవ్వులు చూడటం కూడా ఒక గొప్ప వేడుకే.*ఈ ఆలోచనతో తన జన్మదినాన్ని సేవా కార్యక్రమాలకు వేదికగా మార్చుకున్న కోళ్ల హసీతా నాయుడు వంటి ప్రజాప్రతినిధులు సమాజంలో మరింత మంది సేవా స్ఫూర్తితో ముందుకు రావడానికి ప్రేరణగా నిలుస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఆమె భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ మరెందరో నిరుపేదలకు అండగా నిలవాలని నియోజకవర్గ ప్రజలు