సెంట్రల్ జోన్ క్రికెట్ విజేతగా జవహర్ భారతి కళాశాల!
నెల్లూరు, మేజర్ న్యూస్ : విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన సెంట్రల్ జోన్ క్రికెట్ పోటీల్లో జవహర్ భారతి కళాశాల జట్టు విజేతగా నిలిచింది. విక్రమ సింహపురి యూనివర్సిటీ కళాశాల, నెల్లూరు జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలో జవహర్ భారతి జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకుని ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. అనంతరం విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సుజయ్ చేతుల మీదుగా వీసీ ఛాంబర్‌లో విజేతలు, రన్నరప్ జట్లకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందించి, వారి క్రీడా ప్రతిభను ప్రశంసించారు.