సీనియర్ వైసీపీ నాయకులు వెంకట్రావు మృతి
కామవరపుకోట, మేజర్‌న్యూస్ : మండలంలోని పాతూరుకు చెందిన సీనియర్ వైసీపీ నాయకులు ఘంటా వెంకట్రావు బుధవారం మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. వెంకట్రావుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ వార్డు సభ్యులు ఘంటా భాస్కరరావు, కామవరపుకోట చౌతనా సెంటర్‌లోని ట్రస్ట్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు ఘంటా మధుబాబు ఇద్దరు వెంకట్రావు తనయులు. గ్రామపెద్దగా అందరికి తలలో నాలుకలా ఉండే వెంకట్రావు మృతి పట్ల గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ, మాజీ జడ్పీటీసీ ఘంటా సుధీర్‌బాబు, సొసైటీ మాజీ అధ్యక్షులు సాయిన కనకరాజు, ఘంటా సత్యంబాబు, మాజీ ఉప సర్పంచ్ నెక్కలపు సూర్యనారాయణ, వైసీపీ యువ నాయకుడు ఆరుమళ్ల ధర్మ తదితరులు వెంకట్రావు భౌతికఖాయానికి నివాళులు అర్పించారు. నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ కంభం విజయరాజు, తాజా మాజీ ఎంపీపీ మేడవరపు విజయలక్ష్మి, మండల వైసీపీ అధ్యక్షులు రాయంకుల సత్యనారాయణ ఫోన్లో భాస్కరరావును పరామర్శించారు.
సుభాష్ కామవరపు కోట