BREAKING
అదానీ విద్యుత్ ప్రాజెక్టు వ్యయం తగ్గింపుపై కేంద్ర పర్యావరణ శాఖ విచారణ చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ మండల స్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక పాకిస్థాన్‌కు సైనిక రహస్యాల చేరవేత: వాయుసేన వింగ్ కమాండర్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక మేలుకొలుపు ఏకంగా 22 కిలోల బరువు తగ్గిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. కొత్త లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై మరింత ఉచ్చు మల్లన్నసాగర్ లీకేజీపై హరీశ్‌రావుకు కవిత సవాల్! అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధమా..? సీఎం రేవంత్‌ రెడ్డికి సూటి ప్రశ్నలు కాకరకాయ తింటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుందా.. మధుమేహ బాధితులకు నిపుణుల కీలక సూచనలు! వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన జిల్లా కార్యదర్శి అల్జీరియా వాణిజ్య నిబంధనలపై యూరోపియన్ కమిషన్‌ను ఆశ్రయించిన ఫ్రాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం ఆంత్రోపిక్‌పై ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసు

సీఎం చంద్రబాబుతో జపాన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ కెంజీ హిరమత్సు భేటీ

Select Suryaa Now
సీఎం చంద్రబాబుతో జపాన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ కెంజీ హిరమత్సు భేటీ

విశాఖ, మేజర్‌న్యూస్‌:

 ఆంధ్రప్రదేశ్ లో జపాన్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటుకు ఆ దేశ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని జపాన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ కెంజీ హిరమత్సూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. అనంతపురం లేదా విశాఖ వద్ద ఈ పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు తమ కంపెనీలు ముందుకు వస్తాయని వెల్లడించారు. ప్రస్తుతం ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రీసెర్చితో కలిసి జేఆర్ఐ పనిచేస్తోందని తెలిపారు. వాణిజ్యం లాజిస్టిక్స్ రంగాల్లో జపాన్ -ఇండియా వ్యూహాత్మక ఆర్ధిక భాగస్వామ్యం కలిగి ఉన్నాయని వివరించారు. వంద బిలియన్ డాలర్ల విలువైన ఢిల్లీ- ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ లో జపాన్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ చొరవతోనే జపాన్ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నట్టు సీఎంకు తెలిపారు. ఏపీలో విజయవంతమైన శ్రీసిటీ సెజ్ మోడల్ లోనే పారిశ్రామిక క్లస్టర్ ను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్టు కెంజీ స్పష్టం చేశారు. మారిటైమ్ అభివృద్ధిలో భాగంగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ల లాంటి మౌలిక సదుపాయాల కల్పనలోనూ ఆసక్తిగా ఉన్నట్టు వివరించారు. ఇన్వెస్టర్ రెడీ ఇండస్ట్రియల్ బ్లూ ప్రింట్స్ రూపకల్పనలో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు జేఆర్ఐ  సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. త్వరలోనే అమరావతిలో ఏపీ- జపాన్ బిజినెస్ సమ్మిట్ ను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తు్న్నట్టు కెంజీ హిరమిత్సు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన సీఎం జపాన్ భాగస్వామ్యంతో కలిసి పనిచేసేందుకు ఏపీ సిద్ధంగా ఉందని.. రాష్ట్రంలోని అవకాశాలు, వనరులను అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.