BREAKING
కనకవీడులో పోలీసుల పల్లె నిద్ర రేపటి నుంచి ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0 ప్రారంభం బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్ విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రజలందరి పండుగ సరస్ మేళాతో మహిళా పారిశ్రామికవేత్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన దసరా ఉత్సవాలకు 3,130 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఉపాధి కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు  అగ్రస్థానం గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. ప్రసిద్ధ గ్రామీ అవార్డ్స్ రేసులో ‘ధురంధర్ 2’ సాంగ్స్.. ఏకంగా 9 కేటగిరీల్లో సబ్మిషన్! అంధులను..అందరిని ఆదుకుంటున్న సదాశయ ఫౌండేషన్ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ చెక్‌ల పంచాయితీకి చెక్!

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి -ఎస్ఐఆర్ పేరుతో 13 కోట్ల ఓట్ల తొలగింపు - తిరుపతిలో దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపిన సిఐటియు ఢిల్లీలో నిరసనకారుల అడ్డగింపు ప్రజాస్వామ్యంపై దాడి :వందవాసి నాగరాజు ఆగ్రహం

Select Suryaa Now
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి -ఎస్ఐఆర్ పేరుతో 13 కోట్ల ఓట్ల తొలగింపు - తిరుపతిలో దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపిన సిఐటియు  ఢిల్లీలో నిరసనకారుల అడ్డగింపు ప్రజాస్వామ్యంపై దాడి :వందవాసి నాగరాజు ఆగ్రహం

ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో 13 కోట్ల ఓట్లను తొలగించిన కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం తిరుపతిలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద సీఈసీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఓటు హక్కు కల్పిస్తే, దానిని కాపాడాల్సిన ఎన్నికల సంఘమే కోట్లాది ఓట్లను తొలగించి హక్కులను కాలరాయడం దారుణమన్నారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించకుండా బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తోందని, మోదీ, అమిత్ షా రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థను వాడుకుంటున్నారని విమర్శించారు. ఢిల్లీలో నిరసనకు వెళ్తున్న వారిని అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి అని మండిపడ్డారు. నిరసనకారులను అడ్డుకునేందుకు 57 మెట్రో స్టేషన్లు మూసివేయడం, 50 రైళ్లు రద్దు చేయడం, 30 వేల మంది భద్రతా బలగాలను మోహరించి కర్ఫ్యూ వాతావరణం సృష్టించడం దుర్మార్గమన్నారు. తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చాలని, వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నగర ఉపాధ్యక్షులు కే.వేణుగోపాల్, అధ్యక్షులు డి. పార్థసారథి, ప్రధాన కార్యదర్శి పి.బుజ్జి, ఐద్వా జిల్లా కార్యదర్శి పి.సాయి లక్ష్మి, నాయకులు ఎం. నరేంద్ర, జి.వాసు, ఎస్.మురళి, ఆర్. సిద్ధయ్య, వి.ప్రభాకర్ పాల్గొన్నారు.