సత్యసాయి బాబా శత వర్ష జయంతి వేడుకలు - ఘనంగా ముగింపు ఉత్సవాలు.
రామకృష్ణపురం శ్రీ సత్యసాయి విద్యావిహార్ లో ఈనెల 23న ప్రత్యేక కార్యక్రమాలు.
పలాస, నవంబర్ 20, మేజర్ న్యూస్.
పలాస మండలం రామకృష్ణపురం శ్రీ సత్యసాయి విద్యావిహార్ లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి శత వర్ష జయంతి వేడుకల ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి సంకల్పించారు
నవంబర్ 23, సోమవారం - ఉదయం కార్యక్రమాలు.
బ్రహ్మ ముహూర్తంలో ఓంకార సుప్రభాత నగర సంకీర్తనతో కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.ఉదయం 9.15 గంటలకు ప్రశాంతి పతాకాన్ని ఎగురవేస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి.ఇటీవలే విద్యలో, ఆటల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేస్తారు. అనంతరం స్వామివారి ప్రత్యేక మహా ప్రసాదం ఏర్పాటు చేసారు.సాయంత్రం 5.30 గంటలకు దివ్య నామసంకీర్తనతో సాయంత్రం కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.100 దీపాలతో సాంస్కృతిక కార్యక్రమాలు,ఉయ్యలోత్సవం జరుపబడుతుంది.అనంతరం విందు.భక్తులు అందరూ సకుటుంబ సమేతంగా విచ్చేసి ఆద్యంతం తిలకించి, విద్యార్థినీ విద్యార్థులను ఆశీర్వదించి, స్వామివారి కృపకు పాత్రులు అవ్వగలరని ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతూ ట్రస్ట్ చైర్మన్ మల్లా రామేశ్వరరావు,ప్రిన్సిపాల్ ప్రీతి చౌదరి పై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.