BREAKING
అడవి ఆముదం గింజలు తిని 10 మంది విద్యార్థులు అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం MLC మీర్జా రహమత్ బేగ్ బ్లాక్‌మెయిల్ కేసులో కీలక పరిణామం.. సల్మాన్ ఖాన్ అరెస్ట్, రిమాండ్ పంచాయతీ ఎన్నికలకు కూటమి సంసిద్ధం గెలుపు లక్ష్యంగా నాయకులకు దిశా నిర్దేశం - ఎమ్మెల్యే ముత్తుముల పూతలపట్టులో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అట్టహాసంగా 'అష్టదిగ్గజాలు' కవి సమ్మేళనం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ భాష్యం రామకృష్ణ ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించాలి: పవన్ కళ్యాణ్ అమరుల స్ఫూర్తితో.. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ప్రముఖ మలయాళ గాయని రిమి టోమి రెండో వివాహం, జిమ్ ట్రైనర్ లిబిన్ మాత్యుతో వైభవంగా పెళ్లి ఇంకొల్లు మండలంలో చివరి రోజు సర్పంచ్‌, వార్డు సభ్యులకు 228 నామినేషన్లు దాఖలు ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కోలాహలంగా రాచానుపల్లి వైసీపీ మద్దతు దారుడు, సర్పంచ్ అభ్యర్థి బండ అంజి యాదవ్ నామినేషన్ ఇంట్లోనే మద్యం దుకాణమా.. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యమా? అంధకారంలో పూతలపట్టు మండలంలోని వైఎస్ఆర్ కాలనీలు వీధి దీపాలు లేక ప్రజల నరకయాతన చీకట్లో విషపురుగుల భయం.. పట్టించుకోని అధికారులు పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కవ్వంపల్లి విద్యార్థినికి ఎమ్మెల్యే సన్మానం

సర్పంచ్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి అభ్యర్థులకు దిశానిర్దేశం - ఎమ్మెల్యే ముత్తుముల

Select Suryaa Now
సర్పంచ్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి అభ్యర్థులకు  దిశానిర్దేశం - ఎమ్మెల్యే ముత్తుముల

గిద్దలూరు, మేజర్‌న్యూస్‌ :

గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో ఎన్నికైన కూటమి పార్టీ సర్పంచ్ అభ్యర్థులతో గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రానున్న సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ముందుకు సాగాలని, ప్రజలతో నిరంతరం మమేకమవుతూ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల కార్యాచరణ, ప్రచార వ్యూహాలు, స్థానిక సమస్యలు, ప్రజల ఆకాంక్షలపై పలు కీలక సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి మార్గదర్శకత్వం, సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతూ కూటమి పార్టీ బలపరిచిన అభ్యర్థులు శాలువాలు, పూల మాలలతో ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, సర్పంచ్ అభ్యర్థులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.