BREAKING
శ్రీశైలానికి హంద్రీ నుంచి 1,125 క్యూసెక్కుల వరద నీరు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి తెలంగాణ ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల టెట్‌ ఫలితాలు విడుదల మల్లన్న సేవలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కర్నూలు విమానాశ్రయంలో పైలట్‌ శిక్షణ కేంద్రం ప్రారంభం మల్లన్న సేవలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ సాకలి ఐలమ్మ జయంతి వేడుకలు హైదరాబాద్ అండర్-19 మహిళల జట్టుకు అశ్విత ఎంపిక కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు ఉచిత స్కూటీలు అందజేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హ్యాపీ బర్త్ డే సర్పంచ్ సాబ్.! పోషణతోనే బంగారు భవిష్యత్‌కు బాట గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కృష్ణా నదిపై మూడు బ్రిడ్జిలు నిరుపేద 'గూటికి' ఉప్పల చేయూత

సాంకేతిక భాషా దినోత్సవం – బధిరుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుంది

Select Suryaa Now
సాంకేతిక భాషా దినోత్సవం – బధిరుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుంది

జిల్లా  కలెక్టర్ విజయ కృష్ణన్,  అనకాపల్లి, సెప్టెంబర్ 26: బధిరుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పేర్కొన్నారు. జిల్లాలో  విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఉదయం ప్రపంచ సైన్ లాంగ్వేజ్ (సజ్ఞల భాష) దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్  విజయ కృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... అనకాపల్లి జిల్లాలో ప్రత్యేకంగా ఒక సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రిటర్ (Sign Language Interpreter)ను నియమిస్తామని స్పష్టం చేశారు.  కొత్తగా ఏర్పాటు చేసిన పరిశ్రమలలో బధిరుల మూగ విద్యార్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు పొందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  బధిరులకు ఎదురయ్యే ఎలాంటి సమస్యలనైనా తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు.


ఈ కార్యక్రమంలో  విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కుమారి G. అనూష, డి.ఆర్.ఓ వై సత్యనారాయణ రావు డీఈవో పేరేంటి, డి.ఇ.ఓ  నాగేశ్వరరావు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జారీ: డివిజనల్ పౌర సంబంధాల అధికారి, అనకాపల్లి