BREAKING
రైతుల సందేహాల నివృత్తికి రెజోనియా టోల్‌ఫ్రీ నంబర్ సీఎం సభను విజయవంతం చేయాలి బాక్సాఫీస్ వద్ద నాని 'ది ప్యారడైజ్' హవా.. రెండో రోజే భారీ వసూళ్లు! ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. : రేవంత్ రెడ్డి కంటపడింది.. సిరిసిల్ల ప్రజల పంట పండింది! నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబరు 2 నుంచి అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మిల రొమాంటిక్ 'లవ్' వెబ్ సిరీస్! జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి పోలీసులపై దాడులు ఉపేక్షించేది లేదు శ్రీశైలానికి హంద్రీ నుంచి 1,125 క్యూసెక్కుల వరద నీరు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి తెలంగాణ ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల టెట్‌ ఫలితాలు విడుదల మల్లన్న సేవలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కర్నూలు విమానాశ్రయంలో పైలట్‌ శిక్షణ కేంద్రం ప్రారంభం మల్లన్న సేవలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ సాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

కృష్ణా నదిపై మూడు బ్రిడ్జిలు

Select Suryaa Now
కృష్ణా నదిపై మూడు బ్రిడ్జిలు

కృష్టానదిపై మూడు వారధులు..

అమరావతికి కొత్త రవాణా ముఖద్వారం 
రహదారుల అనుసంధానికి ప్రాధాన్యత

ఎం. గణేశ్ , సూర్య ప్రధాన ప్రతినిధి: అమరావతి అభివృద్ధిలో రహదారి అనుసంధానానికి అత్యంత ప్రాధాన్యం లభిస్తోంది. కృష్ణానదిని దాటే మార్గాలను విస్తరించడం ద్వారా అమరావతిని విజయవాడతోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, జాతీయ రహదారులతో మరింత వేగంగా అనుసంధానించేలా ప్రణాళికలు రూపొందుతున్నాయి. ఇందులో భాగంగా కృష్ణానదిపై రెండు భారీ వారధులు అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో, మరో ప్రతిష్ఠాత్మక సిగ్నేచర్‌ వారధి విజయవాడ–అమరావతి మధ్య ప్రతిపాదితమైంది. దీంతో రాజధాని ప్రాంత రవాణా వ్యవస్థలో కృష్ణానది దాటే మార్గాలకు అదనపు సామర్థ్యం ఏర్పడే అవకాశం ఉంది. అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు సుమారు 189.93 కిలోమీటర్ల పొడవుతో ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిగా ప్రతిపాదించారు. విజయవాడ, గుంటూరు, తెనాలి సహా రాజధాని ప్రాంతాన్ని చుట్టుముట్టే ఈ మార్గం నగరాల మధ్య ప్రయాణాన్ని సులభతరం చేయడంతో పాటు ప్రధాన పట్టణాల్లోకి వచ్చే సుదూర రవాణా వాహనాలను బయటివైపు మళ్లించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టులో కృష్ణానదిపై రెండు వంతెనలు, మూడు సొరంగాలు, భారీ వంతెనలు, చిన్న వంతెనలు, అండర్‌పాస్‌లు తదితర నిర్మాణాలు ఉంటాయి.

ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రతిపాదనలో కృష్ణానది దాటే రెండు మార్గాలు వ్యూహాత్మకంగా కీలకంగా ఉన్నాయి. ఒక వారధి అమరావతి వైపు నుంచి కృష్ణా జిల్లా ప్రాంతానికి అనుసంధానం కల్పించేలా, మరో వారధి దిగువ భాగంలో గుంటూరు–కృష్ణా జిల్లాల మధ్య ప్రత్యక్ష రహదారి సంబంధాన్ని కల్పించేలా ప్రణాళికలో ఉంది. గత అలైన్‌మెంట్‌ వివరాల్లో అమరావతి–మొగలూరు మధ్య ఒక నది దాటే మార్గం, బట్లపెనుమర్రు–జంపని వైపు మరో నది దాటే మార్గాన్ని ప్రతిపాదించినట్లు నమోదైంది.ఈ రెండు వారధుల ప్రధాన ఉద్దేశ్యం కేవలం కృష్ణానదిపై మరో రెండు రహదారులు నిర్మించడం మాత్రమే కాదు. విజయవాడ నగరంపై పెరుగుతున్న వాహన ఒత్తిడిని తగ్గించడం, గుంటూరు–కృష్ణా జిల్లాల మధ్య సరుకు రవాణా వేగాన్ని పెంచడం, అమరావతి పరిధిలోకి వచ్చే జాతీయ రహదారులన్నింటినీ పరస్పరం అనుసంధానించడం వంటి విస్తృత లక్ష్యాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి ఓఆర్‌ఆర్‌ను రాజధాని ప్రాంతంలో ప్రాంతీయ అనుసంధానాన్ని మెరుగుపరిచే గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టుగా పేర్కొంది.ఇక ఈ రెండు వంతెనలకు భిన్నంగా విజయవాడ నగరానికి అత్యంత సమీపంలో మరో కీలక వారధి రూపుదిద్దుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రకాశం బ్యారేజీకి సుమారు 300 మీటర్ల దిగువన సీతానగరం వైపు నుంచి విజయవాడ వైపున జాతీయ రహదారి–65, కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రాంతాన్ని అనుసంధానించేలా సుమారు 1.1 కిలోమీటర్ల పొడవైన ఆరు వరుసల సిగ్నేచర్‌ బ్రిడ్జిని ప్రతిపాదించారు. ఈ వంతెనను దాదాపు రూ.1,000 కోట్ల వ్యయంతో నిర్మించే ఆలోచన ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఈ సిగ్నేచర్‌ బ్రిడ్జి నిర్మాణానికి ముందుగా సాధ్యాసాధ్యాల నివేదిక, సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయడానికి కన్సల్టెంట్‌ను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభమైంది. అమరావతి గ్రోత్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ 2026 ఆగస్టు 4న ఇందుకు సంబంధించిన ఆర్‌ఎఫ్‌పీని జారీ చేసింది. బిడ్ల సమర్పణకు గడువును సెప్టెంబర్‌ 2 వరకు పొడిగించారు. అంటే ప్రస్తుతం ఈ వారధి నిర్మాణం తుది నిర్మాణ దశలో కాకుండా ప్రాజెక్టు రూపకల్పన, సాంకేతిక అధ్యయనాలు, నివేదికల దశలో ఉందని స్పష్టమవుతోంది.సిగ్నేచర్‌ బ్రిడ్జిని సాధారణ రహదారి వంతెనగా కాకుండా అమరావతికి ప్రత్యేక ప్రవేశద్వారంగా తీర్చిదిద్దే ఆలోచన కూడా ఉంది. పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు, సైకిల్‌ మార్గాలు, ఆధునిక దీపాలంకరణ, కృష్ణానది అందాలను వీక్షించే ఏర్పాట్లు వంటి అంశాలను ప్రతిపాదనలో పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. దీనివల్ల ఈ వారధి రవాణా సదుపాయంతో పాటు రాజధాని ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపునిచ్చే నిర్మాణంగా మారే అవకాశం ఉంది.మూడు వంతెనలను సమగ్రంగా చూస్తే అమరావతి రవాణా వ్యవస్థలో కొత్త దశకు నాంది పలికే అవకాశముంది. ఓఆర్‌ఆర్‌లోని రెండు వారధులు రాజధాని చుట్టూ ప్రాంతీయ, సుదూర రవాణాను వేగవంతం చేశారు.