BREAKING
దేశంలో కలకలం రేపుతున్న డయాబెటిస్.. కోట్లాది మందికి ఇంకా వ్యాధి నిర్ధారణే కాలేదన్న కొత్త సర్వే! చలికాలంలో పెదాలు పగిలి మంటగా ఉంటుందా.. ఈ చిన్న టిప్స్‌తో సాఫ్ట్‌గా మార్చుకోండి! రోజూ నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా.. కిడ్నీ ఆరోగ్యంపై వైద్యులు ఇస్తున్న హెచ్చరికలు ఇవే! అటవీ అమరవీరుల త్యాగం సిరస్మరణీయం ప్రతిరోజూ ఉదయం సోంపు వాటర్ తాగుతున్నారా.. అయితే ఈ ఆరోగ్య రహస్యాలు మీకోసమే! పాత కొమ్ముగూడెంలో పలు నిర్మాణ పనులకు శ్రీకారం చలికాలంలో ఈ ఏడు పొరపాట్లు అస్సలు చేయకండి.. చిన్న నిర్లక్ష్యమే పెద్ద అనారోగ్యానికి దారితీస్తుంది! ప్రతి రోజు ఒక గ్లాసు పసుపు పాలు తాగుతున్నారా.. అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీకోసమే! బిక్కవోలు జనసేనకు 100% విజయం 400 క్వింటాల సబ్సిడీ సెనగ ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా ఏఐ ఏజ్-చెక్: గ్లోబల్ విస్తరణ మహిళా భవన్ నిర్మాణానికి భూమి పూజ. జాతీయ లోక అదాలత్ ను జయప్రదం చేయాలి అండాల సేకరణ అక్రమ దందాపై సర్కారు ఉక్కుపాదం తాగునీటి సరఫరా పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం అందాలి * జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కొండబోలు *

Select Suryaa Now
సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం అందాలి   * జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కొండబోలు *

శ్రీకాకుళం, సూర్య : పేద, ధనిక తేడా లేకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం అందించడమే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) ముఖ్య ఉద్దేశమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్‌ఎస్‌ఏ అధ్యక్షురాలు సునీత కొండబోలు స్పష్టం చేశారు. న్యాయం పొందడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని, ఆర్థిక పరిస్థితులు ఎవరికీ ఆటంకం కారాదన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని డీఎల్‌ఎస్‌ఏ కార్యాలయంలో సంస్థ కార్యదర్శి కె. హరిబాబు ఆధ్వర్యంలో సోమవారం ‘లీగల్ సర్వీసెస్ డే’ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. న్యాయస్థాన ఖర్చులు భరించలేని నిరుపేదలు డీఎల్‌ఎస్‌ఏను సంప్రదిస్తే అర్హత మేరకు పూర్తి ఉచిత న్యాయ సహాయం అందజేస్తామన్నారు. జాతీయ లోక్ అదాలత్, మీడియేషన్ 3.0 వంటి కార్యక్రమాల ద్వారా వివాదాలను సామరస్యంగా, రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. దీనివల్ల కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు కోర్టులపై కేసుల భారం తగ్గుతుందన్నారు. బ్యాంక్ రుణాలు, ప్రమాద పరిహారం, చిట్‌ఫండ్, పోలీస్ సంబంధిత కేసుల్లో బాధితులకు అండగా నిలుస్తున్నామని, ప్రభుత్వ విభాగాలు, బ్యాంకులు, పోలీసులు ఇందుకు సహకరించాలని కోరారు.

ఏడాదిలో 30,281 కేసులు పరిష్కారం..
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు గత ఏడాది కాలపు (2025 నవంబరు 1 నుంచి 2026 అక్టోబరు 31 వరకు) ప్రగతి నివేదికను వెల్లడించారు. నాలుగు జాతీయ లోక్ అదాలత్‌ల ద్వారా 244 ప్రీ-లిటిగేషన్, 30,281 పెండింగ్ కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. 445 న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించి 381 మందికి నేరుగా ఉచిత న్యాయ సహాయం అందించామన్నారు. న్యాయవాదులకు 40 గంటల ప్రత్యేక మధ్యవర్తిత్వ శిక్షణతో పాటు 'మీడియేషన్ ఫర్ నేషన్ 3.0' ర్యాలీ నిర్వహించామన్నారు. ప్రజలకు సేవలను చేరువ చేసేందుకు బీఆర్ అంబేద్కర్ వర్సిటీ, ఎంపీఆర్‌ఎల్ కళాశాల, ప్రశాంతి వృద్ధాశ్రమం, కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు, సైనిక్ బోర్డులో ప్రత్యేక క్లినిక్, ఈశాన్య రాష్ట్రాల పౌరులకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. నల్సా ఆధ్వర్యంలో ఆశా, సంవాద్, శిక్షా కార్యక్రమాలను అమలు చేస్తూనే.. మానోవికాస కేంద్రానికి వాటర్ ప్యూరిఫైయర్లు, గీజర్లు, హెచ్‌ఐవీ బాధితులకు పౌష్టికాహారం పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో న్యాయమూర్తులు వై. బెన్నయ్య నాయుడు, బి. సాధుబాబు, సీహెచ్ వివేక్ ఆనంద్ శ్రీనివాస్, పోక్సో జడ్జి ఎం. సునీత, ఆర్. శాంతిశ్రీ, కె. అనురాగ్, వి. శాంతి, జమ్రుత్ బేగం, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. రాజారావు, ప్రతినిధులు, ప్యానెల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.