BREAKING
పోలీసులపై దాడులు ఉపేక్షించేది లేదు శ్రీశైలానికి హంద్రీ నుంచి 1,125 క్యూసెక్కుల వరద నీరు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి తెలంగాణ ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల టెట్‌ ఫలితాలు విడుదల మల్లన్న సేవలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కర్నూలు విమానాశ్రయంలో పైలట్‌ శిక్షణ కేంద్రం ప్రారంభం మల్లన్న సేవలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ సాకలి ఐలమ్మ జయంతి వేడుకలు హైదరాబాద్ అండర్-19 మహిళల జట్టుకు అశ్విత ఎంపిక కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు ఉచిత స్కూటీలు అందజేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హ్యాపీ బర్త్ డే సర్పంచ్ సాబ్.! పోషణతోనే బంగారు భవిష్యత్‌కు బాట గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కృష్ణా నదిపై మూడు బ్రిడ్జిలు

సమాజ సేవను ప్రోత్సహించడమే ఎన్ ఎస్ ఎస్ ఉద్దేశం

Select Suryaa Now
  సమాజ సేవను ప్రోత్సహించడమే ఎన్ ఎస్ ఎస్ ఉద్దేశం

సమాజ సేవకు ప్రోత్సహించడమే ఎన్ఎస్ఎస్ ఉద్దేశం

పులివెందుల మేజర్ న్యూస్: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పులివెందుల లో ఎన్ ఎస్ ఎస్ యూనిట్ వన్ అండ్ టు ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ డే నిర్వహించడం జరిగినది. సామాజిక సేవను నిర్వచించి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్ తనుజ మేడం విచ్చేసి విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ రోజు మనం జాతీయ సేవా పథకం – ఎన్ ఎస్ ఎస్ కార్యక్రమంలో భాగంగా ఒకచోట చేరడం ఎంతో ఆనందంగా ఉంది. NSS యొక్క ప్రధాన లక్ష్యం  “నేను కాదు, నీవు” అనే సేవా భావాన్ని విద్యార్థుల్లో పెంపొందించడం. ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులకు కేవలం పాఠ్యపుస్తక జ్ఞానాన్ని మాత్రమే కాకుండా, సమాజం పట్ల బాధ్యత, సేవాభావం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు మరియు మానవతా విలువలను నేర్పిస్తుంది. సమాజంలోని సమస్యలను అర్థం చేసుకొని, వాటి పరిష్కారంలో విద్యార్థులు భాగస్వాములు కావడం ఎన్ఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పరిశుభ్రత, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, రక్తదానం, మొక్కల పెంపకం, అక్షరాస్యత, మహిళా సాధికారత, సామాజిక అవగాహన వంటి అనేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలి.ఒక మంచి ఎన్ఎస్ఎస్ వాలంటీర్ అంటే కార్యక్రమాలకు హాజరయ్యే వ్యక్తి మాత్రమే కాదు; అవసరంలో ఉన్నవారికి సహాయం చేసే, సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండే, ఇతరులకు ఆదర్శంగా నిలిచే వ్యక్తి.వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ యు శ్రీనిత ప్రతి విద్యార్థి తన చుట్టూ ఉన్న సమాజాన్ని మెరుగుపరచడానికి ఒక చిన్న అడుగు వేయాలి. ఒక మొక్క నాటడం, ఒక వ్యక్తికి అవగాహన కల్పించడం, ఒక గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ఒకరికి సహాయం చేయడం వంటి చిన్న చర్యలే పెద్ద సామాజిక మార్పుకు దారితీస్తాయి.