BREAKING
బీసీ జనబేరీకి భారీగా తరలిరావాలి - బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు లోబడే లహుకుమార్ డిసెంబర్‌లో థియేటర్లలోకి తిరువీర్ ‘భగవంతుడు’.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు అంతర్జాతీయ క్రీడల్లోకి రష్యా పునరాగమనానికి యూరప్ దేశాల అడ్డుకట్ట జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం బెల్జియం బడ్జెట్ చర్చలకు డిసెంబర్ 31 గడువు చేనేతపురం అభివృద్ధి మా ముందున్న కర్తవ్యం.. ఎమ్మెల్యే బి వి చిన్న సినిమాలకు థియేటర్ల కేటాయింపులో వివక్ష.. హైదరాబాద్ కలెక్టర్‌కు దర్శకుడు షెరాజ్ మెహదీ ఫిర్యాదు సామాజిక సామరస్య పరిష్కార కేంద్రం ఏర్పాటు అత్యంత వైభవంగా శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం దండు మల్కాపురంలో యాదవుల సదర్‌ సంబరాలు జాంబియా ప్రతిపక్ష నేతపై రాజద్రోహం కేసు కోలాహలంగా మేయర్ లక్ష్మీఅపర్ణ, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం నాకు ఇంకా పెళ్లి కాలేదు.. వైరల్ వీడియో కామెంట్‌పై డింపుల్ హయాతి స్పందన ప్రాథమిక సహకార సంఘం కేంద్రం ప్రారంభం

సైదాపురం సర్పంచ్ అభ్యర్థిగా బోలిగర్ల అర్చన నామినేషన్

Select Suryaa Now
సైదాపురం సర్పంచ్ అభ్యర్థిగా బోలిగర్ల అర్చన నామినేషన్

*సైదాపురం, నవంబర్ 23 (మేజర్ న్యూస్):*

సైదాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన బోలిగర్ల అర్చన సోమవారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతో పాటు గ్రామపంచాయతీలోని 14 వార్డుల సభ్యులు కూడా నామినేషన్లు సమర్పించారు.

వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో సైదాపురం మండల కేంద్రంలోని బస్టాండ్ పరిసరాలు జనసందోహంతో కిటకిటలాడాయి. పార్టీ శ్రేణుల నినాదాలు, అభ్యర్థులకు మద్దతుగా వచ్చిన అనుచరుల సందడితో మండల కేంద్రంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. చాలా కాలం తర్వాత సైదాపురం బస్టాండ్ పరిసరాలు ఇంతటి సందడిగా మారడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

ఈ సందర్భంగా బోలిగర్ల అర్చన మాట్లాడుతూ సైదాపురం గ్రామ సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, సిమెంట్ రహదారుల నిర్మాణం, ప్రతి వీధిలో వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వారి సలహాలు సూచనలతో పారదర్శకమైన పాలన అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజలు తనపై నమ్మకంతో గెలిపిస్తే గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని అన్నారు.

నామినేషన్ కార్యక్రమం అనంతరం తిరిగి వచ్చిన అర్చనకు మహిళలు మంగళహారతులు పట్టి, తిలకం దిద్ది, పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంతో సైదాపురం గ్రామంలో పంచాయతీ ఎన్నికల సందడి మరింత పెరిగింది.