సాధారణ వ్యక్తిగా ఓటు వేసిన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదివారం సామాన్య ఓటరుగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని 27వ డివిజన్ మాగుంట లేఔట్‌లో ఉన్న ఎస్‌ఆర్‌కే స్కూల్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన, ఇతర ఓటర్లతో కలిసి క్యూ లైన్‌లో నిలబడి ఓటు వేశారు. ప్రజాప్రతినిధి అయినప్పటికీ సాధారణ ఓటరుగా క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకోవడం ఈ సందర్భంగా ప్రత్యేకంగా నిలిచింది.