BREAKING
బెల్జియం ట్యాక్స్ ఏజెన్సీపై సైబర్ దాడి కలకలం.. ఆన్‌లైన్ పోర్టల్ తాత్కాలిక నిలిపివేత ఆర్నబ్ తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి....ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్... మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కసిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీలను అభినందిస్తున్న ..ఎంపీ శబరి..! ఎయిర్‌ కెనడా, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానయాన ఒప్పందం ప్రధాని మోదీపై ఖర్గే వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ దళిత మోర్చా నేత నింగ్యారి యాదగిరి* సైబర్ నేరాల పట్ల యువత అవగాహన కలిగి ఉండాలి* 2030 లక్ష్య సాధనకు భారత్ బృహత్తర ప్రణాళిక ఏఐ ట్రైనింగ్ వర్కర్లపై చట్టవిరుద్ధ నిఘా ఆరోపణలను ఖండించిన స్కేల్ ఏఐ రక్తదానం గొప్ప సామాజిక సేవకు ప్రతీక పెరుగుతున్న వాతావరణ ముప్పుపై భీమా రంగం హెచ్చరిక శివన్నగూడెం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి.. ఉమ్మడి నల్లగొండ రైతులకు నీటి భరోసా కల్పించాలి! చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అమెరికా వ్యాపార దిగ్గజాల కీలక డిమాండ్..రాజకీయ స్థిరత్వం, సుస్థిర ఆర్థిక విధానాలే ప్రాధాన్యత తుఫాన్ వర్షాలకు పెద్దూరులో కూలిన ఇంటి స్లాబ్

రక్తదానం ప్రాణదానం తో సమానం - ఆత్మకూరులో పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదానశిభిరం

Select Suryaa Now
రక్తదానం ప్రాణదానం తో సమానం - ఆత్మకూరులో పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదానశిభిరం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :   రక్తదానం ప్రాణదానం తో సమానం అని ఆత్మకూరు డి ఎస్ పి టి. వెంకటేశ్వర్లు  పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఆత్మకూరులోని ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీస్ అధికారులు, పోలీసు సిబ్బందితో పాటు పలువురు 75 యూనిట్ల రక్తాన్ని  దానం చేశారుm ఈ సందర్భంగా డిఎస్పి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్కరణార్థం వారం రోజులపాటు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అమర పోలీసులను స్మరించుకుంటున్నామని పేర్కొన్నారు. రక్తదానం సమాజానికి ఎంతో ఆవశ్యకమని, రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, ఆపదలో ఉన్న వారికి రక్తం ప్రాణదానం చేస్తుందని పేర్కొన్నారు. స్థానిక సి ఐ జి.గంగాధర్ మాట్లాడుతూ వారం రోజులు పాటు వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలతో విధుల నిర్వహణలో అసువులు బాసిన అమర పోలీసుల ను స్మరించుకుంటున్నామని పేర్కొన్నారు. వారి జ్ఞాపకార్థం సమాజానికి ఎంతో ఉపయోగకరమైన రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని సిఐ గంగాధర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు జంపాని కుమార్,కాసా శ్రీనివాసులు రెడ్డి,రాజేష్, పలువురు పోలీస్ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.