BREAKING
బాధిత కుటుంబానికి ఆర్థిక, నిత్యావసర వస్తువుల పంపిణీ మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట భద్రత మద్దికెరలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ఎన్నికల ప్రచారం ప్రజాస్వామ్యానికి ఓటే ప్రాణం.. ప్రతి ఒక్కరూ ఓటేయాలి సమాజ హితమే నా లక్ష్యం.: ఘనంగా ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ వర్మ పదవీ విరమణ వేడుక : పొదిచన్‌పల్లి తండా సమీపంలో పసికందు కలకలం సంగారెడ్డి టి ఆర్ ఏ అధ్యక్షుడిగా పుట్టి సాయిలు నియామకం తొండుపల్లి జాతీయ రహదారి 44పై ప్రజల ప్రాణాలతో చెలగాటమా? సిద్దిపేటలో జువెనైల్ జస్టిస్ బోర్డు ప్రారంభం కోర్టు ప్రాంగణంలో మెడికల్ డిస్పెన్సరీ ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. శరత్ పెనుబర్తిలో ప్రతి గడపకు చేరిన టీడీపీ ప్రచారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ.. తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి నీటిని పొదుపు చేసుకోండి శెట్టూరు మండలం, కంబాలపల్లి గ్రామం లో కలకలం, గొల్ల వీరుపాక్షి పై కొడవలి తో డాడీ. నిజాన్ని నిర్బంధించలేకపోయారు.. న్యాయమే గెలిచింది విద్యుత్ షాక్‌తో యువ ఎలక్ట్రిషియన్ మృతి.

రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. కూటమిని ఆశీర్వదించండి: ఎమ్మెల్యే కావ్య

Select Suryaa Now
రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. కూటమిని ఆశీర్వదించండి: ఎమ్మెల్యే కావ్య

కావలి,  మేజర్ న్యూస్ :    దగదర్తి మండలం వెలుపోడు సెగ్మెంట్ పరిధిలోని ధర్మవరం గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కూటమి బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.  దివంగత మాలేపాటి సుబ్బానాయుడు సతీమణి మాలేపాటి భావనమ్మను దగదర్తి ఎంపీపీగా, జెడ్పీటీసీ అభ్యర్థి మాందా శీనయ్యను, ఎంపీటీసీ అభ్యర్థి మద్దెల పద్మను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ధర్మవరం గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డీఎఫ్, డీఆర్ ఛానల్ పనులను వేగవంతం చేసి సాగునీటి సమస్య లేకుండా చూస్తామన్నారు. ఏళ్ల తరబడి నలుగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని స్పష్టంచేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరలోనే కొత్త పింఛన్లు, ఇళ్ల స్థలాల కేటాయింపు పూర్తి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.