BREAKING
ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గ ఆలయంలో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో హుండీ ప్రారంభం విపత్తు నిర్వహణలో విద్యార్థుల భాగస్వామ్యం అత్యంత కీలకం పశుగ్రాస సాగుకు దరఖాస్తుల ఆహ్వానం కొత్తమ్మతల్లి సేవలో ఖాకీలు రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికైన ఎస్.రాయవరం విద్యార్థినులు! పెనుగొండ వాసవి అమ్మవారి శరన్నవరాత్రులకు ఘన ఏర్పాట్లు ★పది రోజుల పాటు వివిధ అలంకారాల్లో దర్శనం మానసిక ఆరోగ్యంపై అపోహలు వీడాలి! ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రజా సమస్యల వినతులు స్వీకరణ... బీసీలకు ద్రోహం చేసింది వైసీపీనే! చెన్నైలో సీఎం విజయ్‌తో రాహుల్ గాంధీ భేటీ ఢిల్లీలో సీఈసీపై నిరసనల వేళ.. నీలంకరైలోని నివాసంలో గంటపాటు ఏకాంత చర్చలు. జిల్లా జడ్పీ సీఈఓ గా టి.ఎన్.శోభన్ బాబు 25వ రోజుకు చేరిన వి ఆర్ ఏ ల రిలే నిరాహార దీక్ష పాకలపాడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం – ప్రజలకు అవగాహన కల్పించిన సీఐ రేవతమ్మ

రైతు బిడ్డగా రైతుల కష్టాలు తీరుస్తున్న చంద్రబాబు!

Select Suryaa Now
రైతు బిడ్డగా రైతుల కష్టాలు తీరుస్తున్న చంద్రబాబు!

-ఒకే రోజు 3,304 ఎకరాల భూ సమస్యలకు పరిష్కారం..

-కొండపిలో 39 వేల మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ

-కొండపి నియోజకవర్గంలో రూ.700 కోట్లకు పైగా అభివృద్ధి పనులు..

- మరో రూ.700 కోట్లతో సంక్షేమం

-వెలిగొండ, సాగర్‌ జలాలతో కొండపి చివరి ప్రాంతాలకూ నీళ్లు..

- రోడ్ల నిర్మాణానికి మరిన్ని నిధులు ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి

-మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

 ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు బిడ్డగా.. రైతుల కష్టాలు తీర్చుతున్నారని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నర్శింగోలు గ్రామంలో జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సభలో మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ....సీఎం చంద్రబాబు రైతు బిడ్డగా.. రైతుల కష్టాలు తీర్చుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఒకే రోజు 3,304 ఎకరాలకు సంబంధించిన భూ సమస్యలకు సీఎం చంద్రబాబు పరిష్కారం చూపారు. కొండపి, జరుగుమల్లి, సింగరాయకొండ మండలాలతో పాటు మొత్తం ప్రకాశం జిల్లాలోని 4 మండలాలు, 8 గ్రామాల్లోని 2,915 ఎకరాల గర్భకండ్రిక భూముల సమస్యకు పరిష్కారం చూపారు. ఐదేళ్ళు అధికారంలో ఉన్న జగన్ గర్భ కండ్రిక భూముల సమస్యలు ఎందుకు పరిష్కరించలేదు?కూటమి ప్రభుత్వం వచ్చాక కొండపి నియోజకవర్గంలో 39 వేల మంది రైతులకు పట్టాదారు పసుపుస్తకాలు పంపిణీ చేశాం. రెండున్నరేళ్లలోనే

కొండపి నియోజకవర్గంలో రూ. 700 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేశాం, మరో రూ. 700 కోట్లతో ప్రజలకు సంక్షేమం అందించాం. సూపర్ ఎల్ నినో సమయంలో నల్లమల సాగర్ కి వెలుగొండ నీళ్లిచ్చిన వాటర్ మ్యాన్ సీఎం చంద్రబాబు. గత ఐదు ఏళ్ళు సంగమేశ్వర ప్రాజెక్టును పట్టించుకోకుండా వైసీపీ గాలికి వదిలిస్తే.... నేడు కూటమి ప్రభుత్వంలో  టెండర్లు పూర్తి చేశాం, సిగ్గులేకుండా గొడ్డలి పార్టీ మాపై విమర్శలు చేయడం సిగ్గుచేటు. కొండపి నియోజకవర్గం లోని చివరి ప్రాంతాలైన పాలేరు, పాకల, బింగినపల్లిలకు వెలుగొండ జలాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జీవో ఇచ్చారు. ముసి నదికి సాగర్ జలాలు ఇచ్చేందుకు ఒంగోలు మేజర్ కెనాల్ నుంచి .6 టీఎంసీల నీరిచ్చేందుకు రూ. 50 లక్షలతో ఎస్కేప్ ఛానల్ మరియు కెనాల్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు జీవోలిచ్చారు. కొండపి నియోజకవర్గానికి వెలుగొండ, సాగర్ జలాలు తీసుకొస్తున్న అపర భగీదరుడు సీఎం చంద్రబాబు. కొండపి ప్రజల ఆదరణ,  సీఎం చంద్రబాబు ప్రోత్సాహం  దామచర్ల కుటుంబం సహకారంతో 3 సార్లు ఎమ్మెల్యేనయ్యానని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. కొండపి నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి మరికొన్ని నిధులు ఇవ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కోరారు.