BREAKING
టీయూడబ్ల్యూజె – ఐజెయు కమిటీలో లక్షెట్టిపేట ప్రెస్ క్లబ్‌కు కీలక పదవులు ! సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ క్యూ2 ఫలితాలు: రూ. 660 కోట్లకు పెరిగిన ఆదాయం, రూ. 81 కోట్ల నికర లాభం నమోదు రూ. 8,415 కోట్ల AT-1 బాండ్ల రద్దు తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన యెస్ బ్యాంక్ సిగరెట్ ధరలను మళ్లీ పెంచిన ఐటీసీ: గోల్డ్ ఫ్లేక్, క్లాసిక్ కనెక్ట్ కొత్త రేట్లు ఇవే నేటి పంచాంగం 14 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు (14 నవంబర్ 2026, శనివారం): 12 రాశుల దినఫలాలు ఇవే మాస్కోలో భారీ కారు బాంబు పేలుడు: రష్యా అనుకూల నేత సెర్గీ జవోరోట్నీకి తీవ్ర గాయాలు అదానీ విద్యుత్ ప్రాజెక్టు వ్యయం తగ్గింపుపై కేంద్ర పర్యావరణ శాఖ విచారణ చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ మండల స్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక పాకిస్థాన్‌కు సైనిక రహస్యాల చేరవేత: వాయుసేన వింగ్ కమాండర్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక మేలుకొలుపు

రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపికైన కర్రి శేఖర్‌కు అభినందనలు*

Select Suryaa Now
రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపికైన కర్రి శేఖర్‌కు అభినందనలు*

 

*గ్రామీణ క్రీడాకారుడి ప్రతిభకు ప్రోత్సాహం తెలిపిన లయన్‌ డా. ఎం.కె. మిశ్రో*

ఎల్ ఎన్ పేట నవంబర్‌ 12 మేజర్ న్యూస్: 
లక్ష్మీ నర్సుపేట గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కర్రి శేఖర్‌ రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లయన్‌ డా. ఎం.కె. మిశ్రో శేఖర్‌ను అభినందించి, క్రీడల్లో మరింత రాణించాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడం ఎంతో అవసరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని, సరైన శిక్షణతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు సీతారామరాజు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, గురుభక్తం, శ్రీరాములు, శ్రీనివాసరావు, గోవిందరావు, రంగనాథం, ప్రజాకర్‌ రావు, బాలకృష్ణ, పాపయ్య తదితరులు పాల్గొని కర్రి శేఖర్‌కు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.