రాష్ట్ర స్థాయి రగ్బ పోటీలలో కృష్ణా అండర్ 14బాలికల జట్టుకు రజత పతకాలు.
గన్నవరం, మేజర్ న్యూస్.
రాష్ట్ర స్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య అండర్ 14 బాలికల రగ్బ కృష్ణా జట్టు ద్వితీయ స్థానం లో నిలిచి రజత పతకాలు కైవసం చేసుకున్నట్లు కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్సులు రవి, భవాని, గౌసాని, వెంకటేశ్వర్లు పత్రికలకు తెలిపారు. అన్నమయ్య జిల్లా కలిగిరి లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల అండర్ 14 రగ్బ పోటీలలో పాల్గొన్న కృష్ణా బాలికల జట్టు అసమాన క్రీడా నైపుణ్యం ప్రదర్శించి రజత పతకాలను కైవసం చేసుకున్నట్లు వారు తెలిపారు. పతకాలు అందుకున్న క్రీడాకారులను, కోచ్ కాంతిలను అభినందించారు.
మేజర్ న్యూస్ ప్రతినిధి: గుర్రం ప్రసాద్, గన్నవరం, కృష్ణా జిల్లా.