BREAKING
ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులైన ఓటర్లకు మరో అవకాశం-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆనందపురం నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలకు ఎమ్మెల్యే గంటా ఘన సత్కారం బ్రహ్మలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు* ఎస్.రాయవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సోమిరెడ్డి లక్ష్మి నామినేషన్! మాడుగుల జడ్పీటీసీ సభ్యునిగా పుప్పాల లక్ష్మి నారాయణ ప్రమాణ స్వీకారం గోవింద నామస్మరణతో మార్మోగిన ఎస్.రాయవరం! మాకవరపాలెం జడ్పీటీసీగా అల్లు రామనాయుడు ప్రమాణ స్వీకారం క్రీడల్లో పాల్గొనడం వలన మంచి డైరెక్టర్ వ్యాయామం, అభినందించిన ఏ యూ డైరెక్టర్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆచార్య ఎ. పల్లవి పెనుగొల్లులో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల! గెడ్డపాలెంలో వైఎస్సార్‌సీపీ సత్తా చాటిన పీవీఆర్! కోనసీమ జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య.. హోంమంత్రి అనిత సహకారంతో అభివృద్ధి చేస్తా! కొరుప్రోలు జడ్పీ హైస్కూల్లో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు! ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద పెద్దేరు జలాశయంలో చేప పిల్లల విడుదల కనకమహాలక్ష్మి మార్గశిర ఉత్సవాలకు శ్రీకారం

రాష్ట్ర స్థాయి పోటీలకు బాల శాస్త్రవేత్తలు -జిల్లా నుంచి 7గురు చిన్నారుల ప్రాజెక్టులు ఎంపిక -నేటి బాల శాస్త్రవేత్తలే రేపటి భావి శాస్త్రవేత్తలు: డీఈఓ కేవీఎన్ కుమార్

Select Suryaa Now
 రాష్ట్ర స్థాయి పోటీలకు బాల శాస్త్రవేత్తలు -జిల్లా నుంచి 7గురు చిన్నారుల ప్రాజెక్టులు ఎంపిక -నేటి బాల శాస్త్రవేత్తలే రేపటి భావి శాస్త్రవేత్తలు: డీఈఓ కేవీఎన్ కుమార్

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : రాష్ట్ర స్థాయి పోటీలకు తిరుపతి జిల్లా నుంచి 7గురు బాల శాస్త్రవేత్తలు ఎంపికయ్యారు. 32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్-2026 జిల్లా స్థాయి పోటీలు తిరుచానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ నేటి బాల శాస్త్రవేత్తలే రేపటి భావి శాస్త్రవేత్తలని, వారి ప్రాజెక్టులు వారిలోని శాస్త్రీయ సృజనాత్మక ఆలోచనలను వెలికి తీసే విధంగా ఉన్నాయని తెలిపారు. సైన్స్, సుస్థిరమైన ఆవిష్కరణలు నేటి యుగంలో అత్యవసరమని, వాటిని సాధించే విధంగా విద్యార్థులు తయారు కావాలని పిలుపునిచ్చారు. ఏపీ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి జిల్లా సమన్వయకర్త కేడీ సారధి మాట్లాడుతూ వివిధ పాఠశాలల విద్యార్థులు రూపొందించిన విజ్ఞాన ప్రాజెక్టులు ఎంతో నూతనత్వంతో ఆకట్టుకున్నాయన్నారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఏడు ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు వెల్లడించారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను, వారికి మార్గదర్శకత్వం వహించిన గైడ్ ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకడమిక్ సైన్స్ కోఆర్డినేటర్ కోదండపాణి, డీఎస్ఓ వెంకటేశ్వర, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు సుబ్రమణ్యం శర్మ, జ్యూరీ మెంబర్లు, కమిటీ మెంబర్లు, జిల్లాలోని 157 మంది గైడ్ ఉపాధ్యాయులు, 210 మంది చైల్డ్ సైంటిస్ట్‌లు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు 

ఈ సందర్భంగా నిర్వహించిన సైన్స్ కాంగ్రెస్ పోటీలలో ఓబుల్ వారి పల్లి మండలం మంగంపేట ఏపీఎండీసీ పబ్లిక్ స్కూల్ కు చెందిన ఎఫ్.వెనీషా ఫ్రాన్సిస్కా, చిట్వేల్ జిల్లా పరిషత్ హై స్కూల్ కు చెందిన వి.వి.నికిలేశ్వర్, చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు చెందిన పి.రిత్విక్, సూళ్లూరుపేట పద్మావతి విద్యాలయంకు చెందిన సి.నిహాల్ దేవ్, 

శ్రీకాళహస్తికి చెందిన ఆర్ భాగ్యలక్ష్మి భాయ్, 

రేణిగుంట అమరరాజా విద్యాలయం కు చెందిన ఓ శశి, ఆర్ సి పురం మండలం పరమాల జిల్లా పరిషత్ హై స్కూల్ కె చేతన్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్