BREAKING
ఢిల్లీలో భారీగా పడిపోయిన పసిడి ధరలు 8వ వార్డులో తాగునీటి సమస్యకు పరిష్కారం పేదల వైద్యానికి సీఎం సహాయ నిధి అండ-- హాకీని ప్రోత్సహించాలి గ్రామీణ క్రీడా ప్రతిభను వెలికితీయాలి: ప్రభాకర్‌రెడ్డి ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణ మకుటం గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం మంత్రి సుభాష్ జాతీయ స్థాయి క్రీడాకారుడికి ఆర్థిక సాయం ఆసియా క్రీడల్లో గుల్వీర్ సింగ్ హ్యాట్రిక్ రికార్డు 20 ఏళ్ల సమస్యకు మూడు నెలల్లో పరిష్కారం ఆసియా క్రీడల్లో భారత్‌కు కాంస్య పతకం,మిక్స్‌డ్ రిలేలో సరికొత్త జాతీయ రికార్డు నమోదు విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు - ఏఎంసీ చైర్మన్ ఆరికట్ల 23వ అహుడ అథారిటీ సమావేశం రెవెన్యూ సిబ్బంది పనితీరుపై చర్యలు తీసుకోవాలని ఆర్డిఓ కు ఫిర్యాదు కృష్ణపట్నం లో వైద్య శిబిరం న్యాయ విద్యతో రాజ్యాంగ విలువల పరిరక్షణ లా విద్యార్థులతో ఎంపీ అంబికా

రాజ్యాంగ సంస్థలపై బురదజల్లుతున్న రాహుల్ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి

Select Suryaa Now
రాజ్యాంగ సంస్థలపై బురదజల్లుతున్న రాహుల్  దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి

రాజ్యాంగ సంస్థలపై బురదజల్లుతున్న రాహుల్  దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి                 
--ఎన్నికల సంఘంపై కాంగ్రెస్, ఇండీ కూటమి ఆరోపణలు నిరాధారం
--గెలిచినప్పుడు ఈవీఎంలు కరెక్ట్.. ఓడిపోతే ఈవీఎంలదే తప్పా?                 --విపక్షాల ద్వంద్వ వైఖరిపై కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ఫైర్
భీమవరం,ఉమ్మడి ప.గో.జిల్లా సూర్య బ్యూరో : వరుస ఓటములతో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘంపై ‘ఓట్ చోరీ’ అనే  అసత్య ప్రచారం తెరపైకి తెచ్చారని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ  ఇమేజ్‌ను ఏమీ చేయలేక, విపక్షాలు నేరుగా ఎన్నికల సంఘం (ఈ సి ఐ) పై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లు ఉద్దేశపూర్వకంగా తొలగించబడ్డాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధమని శ్రీనివాస వర్మ కొట్టిపారేశారు. అది కేవలం అభ్యంతరాల కోసం ఎన్నికల సంఘం పబ్లిక్ డొమైన్‌లో ఉంచిన ముసాయిదా (డ్రాఫ్ట్) జాబితా మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ డ్రాఫ్ట్ జాబితాలో 2 కోట్ల 80 లక్షల మంది మరణించిన వారు, 3 కోట్ల మంది ఆచూకీ లేని వారు ఉన్నారని ఆయన వివరించారు. అలాగే, 6 కోట్ల 30 లక్షల మంది ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్ళినవారు ఉండగా, ఒకే వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్న కోటి మందికి పైగా డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని స్పష్టం చేశారు. ఈ ముసాయిదాపై ఏ పార్టీకైనా, ఏ వ్యక్తికైనా అభ్యంతరాలు ఉంటే 'ఫారం-7' లేదా 'ఫారం-8' ద్వారా దరఖాస్తు చేసుకునే పారదర్శకమైన అవకాశం ఉందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. ఎన్నికల సంఘం ప్రస్తుతం సంవత్సరానికి నాలుగు సార్లు ఓటరు నమోదు ప్రక్రియను ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తోందని తెలిపారు. దేశంలో 1952 నుండి ఓటర్ల జాబితా సవరణ ( సర్) ప్రక్రియ ఎన్నోసార్లు జరిగిందని, ఆ సమయంలో ఏడుసార్లు కాంగ్రెస్ పార్టీ , దాని కూటమే అధికారంలో ఉందన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీఈసీ యాక్ట్-2023 ప్రకారం ఎన్నికల సంఘం నిర్ణయాలన్నీ ముగ్గురు కమిషనర్ల ఏకగ్రీవ ఆమోదంతోనే జరుగుతున్నాయని, కమిషనర్లు విభేదించారు అన్నది కేవలం పత్రికల్లో వచ్చిన ఊహాగానాలేనని కొట్టిపారేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి ఎలాంటి చట్టం లేదని, కానీ మోడీ  ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో తొలిసారిగా 'ప్రతిపక్ష నాయకుడికి' కూడా ఎంపిక కమిటీలో స్థానం కల్పించారని వివరించారు.కొత్త ఓటరు నమోదు కోసం ఉన్న ఫారం-6 మార్పులపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. ఫారం-6ను ఎక్కడా మార్చలేదని, గతంలో ఫారం-6 , డిక్లరేషన్ ఫారం వేర్వేరుగా ఉండి రెండుసార్లు ఓటీపీలు రావడంతో ప్రజలు ఇబ్బంది పడేవారని వివరించారు. ఓటర్ల సౌలభ్యం కోసమే ఆ రెండింటినీ కలిపి ఒకే ప్రక్రియగా చేశారని, దీనిని మే 27, 2026న సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని గుర్తుచేశారు. ప్రజలకు సౌకర్యంగా ఉంటే కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని విమర్శించారు. 
ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తికి ఒక చోట మాత్రమే ఓటు హక్కు ఉండాలనే కనీస అవగాహన రాహుల్ గాంధీకి లేకపోవడం శోచనీయమని, నకిలీ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లను తొలగించడాన్ని ఆయన వ్యతిరేకించడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని శ్రీనివాసవర్మ విమర్శించారు. 
తమిళనాడు, పంజాబ్, తెలంగాణ, కేరళ లాంటి రాష్ట్రాల్లో గెలిచినప్పుడు ఈవీఎంలు సక్రమంగానే పనిచేసినట్లు భావించే విపక్షాలు, ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంలను తప్పుబట్టడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో విదేశీ శక్తులకు, బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు ఓటు హక్కు కల్పించి లబ్ధి పొందాలని మమతా బెనర్జీ చూసారని ఆరోపించారు. 
గతంలో రాఫెల్ స్కామ్, చౌకీదార్ చోర్ హై, పనామా పేపర్స్ తదితర విషయాల్లో అసత్య ప్రచారం చేసి, కోర్టుల మొట్టికాయల తర్వాత ప్రజలకు క్షమాపణలు చెప్పిన చరిత్ర రాహుల్ గాంధీకి ఉందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఎద్దేవా చేశారు. విదేశాలకు వెళ్లిన ప్రతిసారీ భారతదేశ ప్రతిష్టను, ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రపంచం ముందు కించపరిచేలా రాహుల్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఎన్నికల సంఘంపై నిరాధార ఆరోపణలు చేస్తూ రాజ్యాంగ సంస్థలను అగౌరవపరుస్తున్నారని, ఇందుకు గానూ ఆయన దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పారదర్శకమైన ప్రజాస్వామ్య ప్రక్రియపై బురదజల్లడం మాని, ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుభాష్ రాజు, కాయిత సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట గంగరాజు, భీమవరం మండలాధ్యక్షుడు వబిలిశెట్టి ప్రసాద్ తదితరు పాల్గొన్నరు