రాజరాజేశ్వరిదేవి అలంకరణలో త్రిముఖదుర్గాదేవి:
సిఎస్ పురం,మేజర్ న్యూస్ :
దేవీశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పర్యాటక శైవక్షేత్రమైన భైరవకోనలో రెండవరోజు సోమవారం అమ్మవారిని రాజరాజేశ్వరిదేవి అలంకరణ చేసి పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఉదయం శ్రీత్రిముఖదుర్గభర్గులేశ్వరస్వామి,కాలభైరవేశ్వరస్వామి,నగరేశ్వరస్వామి ఇతర శివలింగాలకు దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ ముప్పాళ్ల శ్యామసుందరరాజు,కార్యనిర్వాహణాధికారి డి.వంశీకృష్ణారెడ్డి అధ్వర్యంలో దేవస్థానం అర్చకులు పంచామృత అభిషేకం పూజలు నిర్వహించి అనంతరం పట్టువస్త్రాలు పూలమాలలతో అలంకరణ చేసి పూజలను నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు భక్తులు పాల్గొని పూజలుచేసి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.అనంతరం దేవస్థానం ఆవరణలో ప్రత్యేకంగా అలంకరించిన మండపం నందు త్రిముఖదుర్గాదేవిని రాజరాజేశ్వరిదేవిగా అలంకరణ చేసి వివిధ హోమపూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి హారతులు ఇచ్చారు.ఈసందర్భంగా పలువురు ఉభయదాతలు పూజల్లో పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.దసరా ఉత్సవాల సందర్భంగా దేవస్థానం ఇఓ వంశీకృష్ణారెడ్డి, నిర్వాహకులు ముప్పాళ్ల శ్యామసుందరరాజు భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక వసతులు కల్పించారు.ఈకార్యక్రమంలో దేవస్థానం అర్చకుల బృందం, సిబ్బంది, భక్తులు, పర్యాటకులు పాల్గొన్నారు.