BREAKING
కనకవీడులో పోలీసుల పల్లె నిద్ర రేపటి నుంచి ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0 ప్రారంభం బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్ విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రజలందరి పండుగ సరస్ మేళాతో మహిళా పారిశ్రామికవేత్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన దసరా ఉత్సవాలకు 3,130 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఉపాధి కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు  అగ్రస్థానం గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. ప్రసిద్ధ గ్రామీ అవార్డ్స్ రేసులో ‘ధురంధర్ 2’ సాంగ్స్.. ఏకంగా 9 కేటగిరీల్లో సబ్మిషన్! అంధులను..అందరిని ఆదుకుంటున్న సదాశయ ఫౌండేషన్ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ చెక్‌ల పంచాయితీకి చెక్!

రాజకీయ పార్టీలు ఏకమైనా రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు.. ఓసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి

Select Suryaa Now
రాజకీయ పార్టీలు ఏకమైనా రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు..   ఓసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి

( మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)

రాజకీయ పార్టీలన్నీ ఏకమై ప్రయత్నం చేసినా బీసీ రిజర్వేషన్లు పెంపు సాధ్యం కాదని ఓసీ  సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జీ కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ బీసీలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని 50 శాతం రిజర్వేషన్లు దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్న రిజర్వేషన్లు పెంచుతామని మభ్యపెడుతున్నాయని ఆయన ఆరోపించారు రాజకీయ ఓనమాలు తెలియని రాజకీయ నాయకులు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి బీసీ రిజర్వేషన్లు పెంచవచ్చని సలహాలు చెబుతున్నారని, 9వ షెడ్యూల్ అనేది చెత్తకుండీ కాదని అందులో చేర్చినా ప్రశ్నించే అధికారం ఉందని సుప్రీంకోర్టు తెలిపిన విషయాన్ని రాజకీయ నాయకులు తెలుసుకోవాలని కరుణాకర్ రెడ్డి తెలిపారు. అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు అధికారాలు లేకుంటే రాజకీయ పార్టీ లు తమ స్వార్థం కోసం రిజర్వేషన్లు నూరు శాతం పెంచేందుకు ప్రయత్నాలు చేసినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని ఆయన తెలిపారు. తమిళనాడులో ప్రస్తుతం అమలవుతున్న  69 శాతం రిజర్వేషన్లు అంశం కూడా సుప్రీంకోర్టు సమీక్ష లో  ఉందనే కనీస పరిజ్ఞానం రాజకీయ నాయకులకు లేకపోవడం సిగ్గుచేటని, ఇటీవల 50 శాతం రిజర్వేషన్ల కంటే పెంచిన బీహార్ మహారాష్ట్ర తెలంగాణ తదితర రాష్ట్రాలలోని రిజర్వేషన్లను న్యాయస్థానం కొట్టి వేసిందన్న విషయం తెలుసుకోవాలని ఆయన తెలిపారు. అన్ని రంగాలలో ఓసీలను అణచివేస్తూ రిజర్వేషన్ల పేరుతో నాటకాలు ఆడుతున్న ఓసి రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పేందుకు త్వరలో ముఖ్యమంత్రి పదవులకు కూడా రిజర్వేషన్లు ఉండాలనే ఉద్యమం మొదలైతే అప్పుడు ఓసి నాయకులకు బుద్ధి వస్తుందని ఆయన తెలిపారు.