BREAKING
కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలి వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్‌.. రిస్ట్రిక్టెడ్ చాట్‌తో మరింత భద్రత ఘనంగా అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం ఘనంగా తిరునక్షత్ర మహోత్సవం విషాద ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి 108 సేవలను సద్వినియోగం చేసుకోవాలి చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి ఏర్పాటు పరిశీలించిన ఎన్నికల అధికారి పేదింట పెళ్లి పందిరికి ప్రభుత్వ చేయూత!* శరన్నవరాత్రుల సందర్భంగా పంచమి లక్ష్మివారం ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు లేదని మహిళ నిరసన కార్తీక్ ఆర్యన్, శ్రీలీల రొమాంటిక్ మ్యూజికల్ మూవీ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే? అక్రమంగా ఆవుల తరలింపు వాహనం పట్టివేత... రుషింగి దుర్గా దేవి ఆలయంలో మహిళలు భక్తిశ్రద్ధలతోకుంకుమ పూజలు నేనేం చేయలేను..! అది అధిష్టానం నిర్ణయం..

పులివెందుల మున్సిపాలిటీ పీఠం వైసిపిదే

Select Suryaa Now
పులివెందుల మున్సిపాలిటీ పీఠం వైసిపిదే

పులివెందుల మేజర్ న్యూస్:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట పులివెందులలో విజయకేతనం ఎగరేసేది వైసీపీనే,మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వైఎస్ ప్రమీలమ్మ గెలుపు నల్లేరుపై బండి నడకేనని పార్టీ యూత్ అధ్యక్షుడు రామ్ లక్ష్మణ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.వైఎస్ ప్రమీలమ్మ అభ్యర్థిత్వ ప్రకటనతో పులివెందుల వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో నయా జోష్ నిండిందని,క్యాడర్ అంతా యుద్ధక్షేత్రంలో సైనికుల్లా కదం తొక్కేందుకు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.​ఈ సందర్భంగా రామ్ లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ పులివెందుల పురపాలక పరిధిలో వైఎస్సార్ కుటుంబం,వైఎస్సార్సీపీ చేసిన అభివృద్ధి ప్రజల కళ్లముందే కనిపిస్తోందని,ప్రజలతో ఉన్న ఆత్మీయ అనుబంధమే మనకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.వైఎస్ ప్రమీలమ్మ గెలుపే ఏకైక లక్ష్యంగా నాయకులు,కార్యకర్తలు ఒకే తాటిపై నడిచి సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ప్రతీ గడపనూ తొక్కి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజల ఆశీస్సులు పొందాలని దిశానిర్దేశం చేశారు.
రానున్న రోజుల్లో ప్రచార పర్వాన్ని మరింత ఉధృతం చేసి విపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కకుండా చేయడమే మన లక్ష్యమని హెచ్చరించారు.​పులివెందుల మున్సిపాలిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని,వైఎస్ ప్రమీలమ్మ భారీ మెజారిటీతో విజయం సాధించి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపడతారని రామ్ లక్ష్మణ్ రెడ్డి స్పష్టం చేశారు.

పి కృష్ణ పులివెందుల స్టాప్ రిపోర్టర్ కడప జిల్లా