ఏర్పాటు పరిశీలించిన ఎన్నికల అధికారి
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి మేయర్ ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ ఎం. వెంకటేశ్వర్లు గురువారం నగరపాలక సంస్థలో ఏర్పాట్లు పరిశీలించారు. శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ఉండడంతో అక్కడ ఏర్పాట్లపై నగరపాలక సంస్థ కమిషనర్ వైవొ. నందన్, మరో ఎన్నికల అధికారి డీఈవో బాలాజీ రావుతో కలిసి పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఆయన అధికారులతో చర్చించారు.