కలాం ఆశయాలు యువతకు ఆదర్శం కావాలి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
:భారత మాజీ రాష్ట్రపతి,ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏ.పి.జె.అబ్దుల్ కలాం ఆశయాలే యువతకు మార్గదర్శకాలని జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ముత్యాల బాబ్జి కొనియాడారు.కలం జయంతి సందర్భంగా కొత్తపేట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకు ఘన నివాళులర్పించారు.1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించిన కలాం,శాస్త్రవేత్తగా దేశ రక్షణ రంగానికి విశేష సేవలందించారు.ఇస్రోలో ఎస్ఎల్వీ-3 ప్రయోగానికి నాయకత్వం వహించి,క్షిపణి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడంతో ‘మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధి చెందారు.1998 పోఖ్రాన్ అణు పరీక్షల్లో కీలక పాత్ర పోషించారు.2002 నుంచి 2007 వరకు భారత 11వ రాష్ట్రపతిగా సేవలందించి,1997లో భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు.కలలు కనండి..వాటిని సాకారం చేసుకోండి అనే సందేశంతో యువతకు స్ఫూర్తినిచ్చిన కలాం ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కొత్తపేట మండల టీడీపీ అధ్యక్షుడు గనిశెట్టి వీరేష్,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కడలి భీమేశ్వరరావు,కొత్తపేట నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కాసా విజయసాగర్,మండల యాదవ సంఘం అధ్యక్షుడు బయ్యే రాంబాబు తదితరులు పాల్గొన్నారు.